క్రీడాభూమి

‘రియల్’ ఎదురుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, సెప్టెంబర్ 15: యూరోపియన్ చాంపియన్స్ లీగ్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు పోరాడుతున్న మాంచెస్టర్ యునైటెడ్ జట్టు 2-1 తేడాతో స్పోర్టింగ్ లిస్బన్‌పై విజయం సాధించింది. ఒక దశలో రియల్ మాడ్రిడ్ 0-1 తేడాతో వెనుకంజలో నిలిచింది. అయితే, చివరి క్షణాల్లో ఎదురుదాడికి దిగి, ఐదు నిమిషాల తేడాతో రెండు గోల్స్ సాధించి గెలవడం విశేషం. స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ఈక్వెలైజర్‌ను అందించి జట్టుకు ఊరటనిస్తే, అల్వరో మొరాటా కీలక గోల్ చేసి జట్టును గెలిపించాడు. రియల్ మాడ్రిడ్ ఫేవరిట్‌గా బరిలోకి దిగినప్పటికీ, స్పోర్టింగ్ లిస్బన్ ఆరంభం నుంచే దాడులకు ఉపక్రమించింది. దీనితో రియల్ మాడ్రిడ్‌కు రక్షణాత్మక విధానాన్ని అనుసరించక తప్పలేదు. అయితే, మ్యాచ్ 47వ నిమిషంలో బ్రూనో సీజర్ చేసిన గోల్‌తో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన స్పోర్టింగ్ లిస్బన్ ఆతర్వాత డిఫెన్స్‌కు ప్రాధాన్యతనిచ్చింది. గోల్స్ కోసం రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లు ఎంతగా శ్రమించినా మ్యాచ్ ప్రథమార్ధంలో ఫలితం దక్కలేదు. ద్వితీయార్ధంలోనూ చాలా సేపు ఇదే పరిస్థితి కొనసాగింది. రియల్ మాడ్రిడ్‌కు ఓటమి తప్పదేమో అన్న అనుమానాలు తలెత్తాయి. ఆ దశలో, 89వ నిమిషంలో రొనాల్డో గోల్ చేశాడు. ఆట నిర్ణీత సమయానికి కేవలం ఒక నిమిషం ముందు లభించిన ఈ గోల్‌తో రియల్ మాడ్రిడ్ ఓటమి ప్రమాదం నుంచి బయటపడింది. ఇంజురీ టైమ్ నాలుగో నిమిషంలో మొరాటా స్పోర్టింగ్ లిస్బన్ రక్షణ వలయాన్ని లాఘవంగా ఛేదించి కీలక గోల్ చేశాడు. 2-1 ఆధిక్యానికి దూసుకెళ్లిన రియల్ మాడ్రిడ్ అదే తేడాతో మ్యాచ్‌ని ముగించింది.
అగెరో హ్యాట్రిక్: మాంచెస్టర్: సెర్గియో అగెరో హ్యాట్రిక్ నమోదు చేయగా, బొరుసియా మోచెన్‌గ్లాడ్‌బాచ్‌తో జరిగిన మ్యాచ్‌ని మాంచెస్టర్ సిటీ 4-0 తేడాతో సొంతం చేసుకుంది. ఇతిహాద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి చివరి వరకూ మాంచెస్టర్ సిటీ ఆధిపత్యం కొనసాగింది. కాగా అగెరో హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేయడం ఈటోర్నీలో ఇది రెండోసారి.

రిటైర్ అవుతానేమో: అఫ్రిదీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: క్రికెట్ అన్ని ఫార్మెట్స్ నుం చి పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ రిటైరయ్యే అ వకాశాలు కనిపిస్తున్నాయ. త్వరలోనే తాను రిటైర్ అవుతానే మోనని ఒక ఇంటర్వ్యూలో అఫ్రిదీ చెప్పాడు. గౌరవ ప్రదం గా కెరీర్‌ను ముగించాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. పాక్ లో చాలా మంది పేరొందిన ఆటగాళ్లకు కూడా రిటైర్మెంట్ సక్ర మంగా జరగలేదని అన్నాడు. క్రికెట్ బోర్డు అధికారులతో మాట్లాడి రిటైర్మెంట్‌కు రంగం సిద్ధం చేసుకుంటున్నానని అన్నాడు.