క్రీడాభూమి

స్పెయిన్‌తో పోరుకు భారత్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: డేవిస్ కప్ ఎలైట్ వరల్డ్ గ్రూప్ టెన్నిస్ పోరు శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా, స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. డేవిస్ కప్ ర్యాంకింగ్స్‌ను పరిగణలోకి తీసుకుంటే భారత్ కంటే స్పెయిన్ మెరుగైన స్థితిలో ఉంది. ఈ జాబితాలో స్పెయిన్‌ది 14వ స్థానంకాగా, భారత్ 20వ స్థానంలో నిలిచింది. సాకేత్ మైనేని, రాంకుమార్ రామనాథన్ సింగిల్స్ విభాగంలో పోటీపడితే, డబుల్స్‌లో లియాండర్ పేస్‌కు భాగస్వామిగా సాకేత్ మైనేని బరిలోకి దిగనున్నాడు. వాస్తవానికి రోహన్ బొపన్న డబుల్స్ విభాగంలో పోటీపడాల్సి ఉంది. అయితే, ఆరోగ్యం సక్రమంగా లేదని పేర్కొంటూ అతను చివరి క్షణాల్లో పోటీ నుంచి వైదొలిగాడు. దీనితో రిజర్వ్ ఆటగాడు సుమీత్‌కు జట్టులో స్థానం లభించినప్పటికీ, పేస్‌కు పార్ట్‌నర్‌గా సాకేత్‌నే దించాలని భారత టెన్నిస్ సంఘం నిర్ణయించింది.
సాయంకాల మ్యాచ్‌లతో ఇబ్బంది
బలమైన స్పెయిన్‌తో న్యూఢిల్లీలో జరగాల్సిన డేవిస్ కప్ టెన్నిస్ పోటీలను సాయంత్రం వేళల్లో జరపాలన్న నిర్ణయం పట్ల భారత జట్టు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ ఆనంద్ అమృత్‌రాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. దీని వల్ల భారత్‌కు ఇబ్బందే తప్ప లాభం ఏమీ లేదని స్పష్టం చేశాడు. సహజంగా ఏవైనా టోర్నీల్లో ఆతిథ్య దేశాలకు వాతావరణం, డ్రా, కోర్టు స్వభావం వంటి అంశాలు అనుకూలంగా ఉంటాయని అతను పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. కానీ, మ్యాచ్‌లను సాయంత్రం వేళ నిర్వహించాలన్న ఢిల్లీ లాన్ టెన్నిస్ సంఘం (డిఎల్‌టిఎ) నిర్ణయం వల్ల స్పెయిన్ లాభపడుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ‘హోం అడ్వాంటేజ్’ లేకపోవడం భారత ఆటగాళ్ల దురదృష్టమని వ్యాఖ్యానించాడు.
సింగిల్స్ మ్యాచ్‌లను సాయంత్రం ఐదు గంటల నుంచి, డబుల్స్ మ్యాచ్‌లను ఏడు గంటల నుంచి మొదలుపెట్టాలని డిఎల్‌టిఎ ఏకపక్షంగా నిర్ణయించిందని ఆనంద్ ఆరోపించాడు. తననుగానీ, జట్టులోని ఆటగాళ్లనుగానీ అధికారుల సంప్రదించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడానికే సాయంత్రం మ్యాచ్‌లను నిర్వహిస్తున్నామని డిఎల్‌టిఎ స్పష్టం చేస్తుండగా, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకపోవడం దురదృష్టకరమని ఆనంద్ విమర్శించాడు. భారత ఆటగాళ్లు ఎండలో ఆడేందుకే ఇష్టపడతారని అన్నాడు. సాయంత్రానికి వేడి తగ్గి, చలి మొదలవుతుందని, అలాంటి పరిస్థితులు స్పెయిన్‌కు అనుకూలిస్తాయని వివరించాడు. డేవిస్ కప్ వెబ్‌సైట్‌ను చూసిన తర్వాతే తనకు టైమింగ్స్ గురించి తెలిసిందని, ఆటగాళ్లకు వివరాలను అందించాలన్న కనీస మర్యాదను కూడా డిఎల్‌టిఎ పాటించలేదని అన్నాడు. స్పెయిన్‌తో డేవిస్ కప్ మ్యాచ్‌లు సాయంత్రం వేళల్లో జరుగుతాయన్న విషయాన్ని తాను చెప్పే వరకూ రోహన్ బొపన్న తదితరులకు కూడా తెలియదని ఆనంద్ తెలిపాడు. స్పెయిన్‌కు అనుకూలించే రీతిలో మ్యాచ్‌ల సమయాలను నిర్ణయించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించాడు. స్పెయిన్ చాలా బలమైన జట్టనీ, దానికి తోడు సాయంత్రాలు మ్యాచ్‌లు ఆడడంతో ఆ జట్టు మరింత బలపడుతుందని చెప్పాడు. ఈ విషయంపై డిఎల్‌టిఎ పునరాలోచన చేయాలని కోరాడు.
భారీగా అభిమానులు: డేవిస్ కప్ మ్యాచ్‌లను తిలకించడానికి అభిమా నులు భారీగా తరలి వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. స్పెయ న్ సింగిల్స్ వీరులు రాఫెల్ నాదల్, డేవిడ్ ఫెరర్ అంతర్జాతీయ ఖ్యాతి ని ఆర్జించిన వారు కావడంతో, వారి ఆటను చూసేందుకు తరలివచ్చే ప్రేక్షకులతో స్టేడియం కిక్కిరిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తు న్నారు. ఇలావుంటే, సింగిల్స్‌తోపాటు డబుల్స్ విభాగంలోనూ సాకేత్ పోటీపడనున్న నేపథ్యంలో ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

తొలి సింగిల్స్‌లో రాఫెల్ నాదల్‌తో తలపడనున్న భారత ఆటగాడు సాకేత్ మైనేని