క్రీడాభూమి

లోధా కమిటీ సిఫార్సులపై అభిప్రాయాలు తెలపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 7: విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న అంశాలపై అభిప్రాయాలను వెల్లడించాల్సిందిగా అన్ని సభ్య సంఘాలకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) లేఖ రాసింది. ఈ నెలాఖరులో లోధా కమిటీ సిఫార్సులపై బోర్డు విస్తృత స్థాయిలో చర్చిస్తుందని, ఈలోగా అభిప్రాయాలు, అభ్యంతరాలను వెల్లడించాలని బోర్డు కార్యదర్శి, పార్లమెంటు సభ్యుడు అనురాగ్ ఠాకూర్ దేశంలోని అన్ని క్రికెట్ సంఘాలకు లేఖ రాశాడు. ‘కమిటీ చేసిన సిఫార్సుల్లో కొన్ని ఆచరణ సాధ్యంగా లేవు. కొన్ని అంశాలపై నిపుణుల అభిప్రాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను పంపుతున్నాను. వాటి పరిశీలించి మీ అభిప్రాయాలను ఈనెల 31వ తేదీలోగా తెలపాలి’ అని ఠాకూర్ రాశాడు. ఇలావుంటే ఈనెల 13న బిసిసిఐ పాలక మండలి సమావేశం కానుంది. అందులోనూ లోధా కమిటీ సిఫార్సులపై చర్చ జరిగే అవకాశం ఉంది.