క్రీడాభూమి

కొరియా ఓపెన్ బాడ్మింటన్ జయరామ్ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 30: కొరియా ఓపెన్ బాడ్మింటన్‌లో భారత్ పోరు ముగిసింది. మిగతా వారంతా మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించగా, క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరిన అజయ్ జయరామ్ కూడా ఓటమిపాలు కావడంతో ఈ టోర్నీలో భారత్ ప్రస్థానానికి తెరపడింది. క్వార్టర్స్‌లో కొరియాకు చెందిన లీ హ్యున్ చేతిలో 23-25, 13-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. హ్యున్ చేతిలో అతను ఓడడం ఇది రెండోసారి.
‘టాప్-10’లో శ్రీకాంత్
భారత ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ‘టాప్-10’లోకి అడుగుపెట్టాడు. తాజా ర్యాంకింగ్స్‌లో అతనికి తొమ్మిదో స్థానం దక్కింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ ఐదో స్థానానికి చేరుకోగా, రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన పివి సింధు ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది.

కోహ్లీ ఫ్లాప్ షో
* భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్లాప్ షో కొనసాగుతున్నది. ఈ ఇన్నింగ్స్‌తో కలిపి, గత ఆరు ఇన్నింగ్స్‌లో అతను మొత్తం 87 పరుగులు మాత్రమే చేశాడు. వెస్టిండీస్‌పై డబుల్ సెంచరీ సాధించిన తర్వాత అతను ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లో వరుసగా 44, 3, 4, 9, 18, 9 చొప్పున పరుగులు చేశాడు.
* టెస్టుల్లో భారత్ టాస్ గెలవడం వరుసగా ఇది ఏడోసారి. ఇంతకంటే ఎక్కువగా తొమ్మిది పర్యాయాలు టాస్‌ను 1961-64 మధ్యకాలంలో గెలిచింది.

రహానేకు కలిసొచ్చిన
రెండో టెస్టులు!
* భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఆజింక్య రహానేకు ప్రతి సిరీస్‌లోనూ రెండో టెస్టు కలిసొస్తున్నది. ఇప్పటి వరకూ అతను ఏడు శతకాలు సాధించగా, వాటిలో నాలుగు రెండో టెస్టుల్లో నమోదు చేసినవే కావడం విశేషం. తాజా సిరీస్ రెండో టెస్టులోనూ అతను అర్ధ శతకం చేశాడు.

ధ్రువపత్రాలు లేనందుకే...
ముంబయి: కొన్ని సభ్య సంఘాల ప్రతినిధుల సరైన ధ్రువ పత్రాలు లేకుండా రావడం వల్లే శుక్రవారం జరగాల్సిన ఎస్‌జిఎం శనివారానికి వాయిదా పడిందని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. బిసిసిఐలో ఇప్పుడు 31 సభ్య సంఘాలున్నాయి. వాటిలో సస్పెన్షన్‌కు గురైన రాజస్థాన్ క్రికెట్ సంఘంతోపాటు ఓటు హక్కులేని నార్త్ ఈస్ట్ సంఘాలు కూడా ఉన్నాయి. సుమారు 15 మంది ప్రతినిధులు సమావేశానికి హాజరైనప్పుడు సరైన ధ్రువీకరణ పత్రాలను తమ వెంట తెచ్చుకోలేదని సమాచారం. పారదర్శకతపై సుప్రీం కోర్టు పట్టుబడుతున్న నేపథ్యంలో, ఎలాంటి లోపాలు లేకుండా ఎస్‌జిఎంను నిర్వహించాలని బిసిసిఐ భావిస్తున్నది. అందుకే, శుక్రవారం సమావేశం ఆరంభమైన పది నిమిషాల్లోనే ధ్రువీకరణ పత్రాల అంశాన్ని గుర్తించి, శనివారానికి వాయిదా వేసింది. దీనితో లోధా కమిటీ సిఫార్సుల అమలుపై బోర్డు స్పందనపై నెలకొన్న ఉత్కంఠ కొనసాగుతునే ఉంది. శనివారం ఎస్‌జిఎంలో తీసుకునే నిర్ణయాలపైనే బోర్డు అస్తిత్వం ఆధారపడింది.