క్రీడాభూమి

1400 మందికిపైగా ఆటగాళ్లతో ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ ఇంటర్నేషనల్ చెస్ 14వ ఎడిషన్ టోర్నమెంట్ శనివారం నుంచి ఇక్కడి లుడ్లో క్యాజిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రారంభం కానుంది. ఈసారి రికార్డు స్థాయిలో దేశ, విదేశాలకు చెందిన 1,400 మందికి పైగా ఆటగాళ్లు ఈ ఈవెంట్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 35 లక్షల రూపాయల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఈ ఆటగాళ్లంతా మూడు కేటగిరీల్లో తలపడతారు. 10 రౌండ్లు సాగే ఈ ప్రీమియర్ ఈవెంట్‌లో బోరిస్ గ్రచెవ్ (రష్యా) లాంటి పలువురు ప్రపంచ శ్రేణి ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్‌లో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగుతున్న గ్రచెవ్ ఏ-గ్రూప్‌లో తన పోరాటాన్ని ఆరంభించనున్నాడు. ఈ టోర్నీలో భారత బృందానికి కామనె్వల్త్ మాజీ చాంపియన్, గ్రాండ్‌మాస్టర్ ఎంఆర్.లలిత్ బాబు సారథ్యం వహించనున్నాడు. 21 మంది గ్రాండ్‌మాస్టర్లు, మరో 20 మంది అంతర్జాతీయ మాస్టర్లతో ప్రస్తుతానికి దాదాపు 190 మందితో కూడిన ఏ-గ్రూప్‌లో లలిత్ బాబు 10వ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నీలో మెయిన్ ఈవెంట్‌తో పాటు ప్రారంభమయ్యే బి-గ్రూప్‌లో 523 మంది ఆటగాళ్లు పాల్గొంటుండగా, సి-గ్రూప్‌లో అత్యధికంగా 800 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఆటగాళ్ల నుంచి ఇప్పటికీ ఎంట్రీలు వెల్లువెత్తుతుండటంతో శనివారం ఈ ఈవెంట్ ప్రారంభమయ్యే సమయానికి మొత్తం ఆటగాళ్ల సంఖ్య 1,600 దాటడం ఖాయమని నిర్వాహకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.