క్రీడాభూమి
ప్రపంచ కప్ కబడ్డీ థాయ్ ఘన విజయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 17 October 2016
అహ్మదాబాద్, అక్టోబర్ 16: ప్రపంచ కప్ కబడ్డీలో ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో థాయలాండ్ 62-22 తేడాతో అమెరికాపై ఘన విజయాన్ని నమోదు చేసింది. థాయ్ విజృంభణకు అమెరికా నుంచి ఏ దశలో సరైన రీతిలో ప్రతిఘటన ఎదురుకాలేదు.
రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియా 56-17 తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. కాగా, ఈ ఫలితం కారణంగా ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్‌తో పటిష్టమైన భారత్ ఈనెల 18న ఢీ కొంటుంది.
ఇలావుంటే, ఆదివార జరిగిన మూడో మ్యాచ్‌లో జపాన్‌పై కెన్యా 48-27 తేడాతో గెలిచింది.