క్రీడాభూమి

జూనియర్ హాకీలో బాలుర బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాలెన్సియా, అక్టోబర్ 25: నాలుగు దేశాల జూనియర్ ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత బాలుర జట్టు శుభారంభాన్ని సాధించింది. జర్మనీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత డ్రాగ్ ఫ్లికర్ వరుణ్ కుమార్ రెండు గోల్స్‌తో రాణించాడు. 17, 25 నిమిషాల్లో వరుణ్ సాధించిన రెండు గోల్స్‌కు తోడు 68వ నిమిషంలో భారత్‌కు అజయ్ యాదవ్ మరో గోల్‌ను అందించాడు. దీంతో భారత జట్టు 3-1 గోల్స్ తేడాతో జర్మనీని మట్టికరిపించి ఈ టోర్నీలో బోణీ చేసింది. బుధవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత బాలుర జట్టు బెల్జియంతో తలపడనుంది. అయితే మహిళల విభాగంలో ఐదు దేశల మధ్య జరుగుతున్న జూనియర్ ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టుకు ఆదిలోనే చుక్కెదురైంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన భారత జట్టు 0-3 తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. తదుపరి మ్యాచ్‌లో బాలికల జట్టు స్పెయిన్ జట్టుతో తలపడనుంది.

ప్రొఫెషనల్ బాక్సర్లుగా అఖిల్, జితేందర్?

న్యూఢిల్లీ, అక్టోబర్ 25: బీజింగ్ ఒలింపిక్స్‌లో సంచనాలు సృష్టించిన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇద్దరు ప్రముఖ బాక్సర్లు ప్రొఫెషనల్స్‌గా మారడం ద్వారా మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. ఇప్పటికే విజేందర్ సింగ్ ప్రొఫెషనల్‌గా మారి డబ్ల్యుబఓ ఆసియా పసిఫిక్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, అఖిల్ కుమార్, జితేందర్ కుమార్ కూడా అదే బాటలో సాగాలని అనుకుంటూ విజేందర్ ప్రమోటర్లయిన ఇన్‌ఫినిటీ ఆప్టిమల్ సొల్యూషన్స్ (ఐఓఎస్)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే విజేందర్‌లాగా తాము కూడా ప్రొఫెషనల్ బాక్సర్లుగా మారడానికి తమ యజమానులైన హర్యానా పోలీసు అధికారిక అనుమతి కోసం ఈ ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. విజేందర్ కూడా హర్యానా పోలీసు శాఖలో డిజిపిగా పని చేస్తున్న విషయం తెలిసిందే. నిజానికి రాబోయే రెండు నెలల్లో విజేందర్‌తో పాటుగా భారత్‌లోనే ఒక ఫైట్‌నైట్‌లో పాల్గొనడం ద్వారా ప్రొఫెషనల్ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాలని ఈ ఇద్దరూ అనుకుంటున్నారు. దేశంలో బాక్సింగ్ ముఖచిత్రాన్ని మార్చివేయడంలో అఖిల్ ఎంత ప్రభావం చూపించారో ఈ క్రీడ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసునని ఐఓఎస్ సిఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ నీరవ్ తోమార్ అంటున్నారు. కామనె్వల్త్ గేమ్స్ బాంటమ్ వెయిట్ స్వర్ణపతక విజేత అయిన అఖిల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అప్పటి నంబర్ వన్ బాక్సర్ అయిన సర్గీ వొడోప్యానోవ్‌పై విజయం సాధించి సంచలనం సృష్టించడం తెలిసిందే. ఫ్లైవెయిట్ విభాగంలో పోటీ చేసిన జితేందర్ సైతం బీజింగ్ ఒలింపిక్స్‌లో తనకన్నా బలమైన ప్రత్యర్థులపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ దాకా చేరుకున్నప్పటికీ గాయం కారణంగా పతకం సాధించలేకపోయాడు. ఈ ఇద్దరూ భారత్‌కు తిరిగి వచ్చాక పతకాలు సాధించిన వారితో సమానంగా వీరికీ సన్మానాలు, సత్కారాలు లభించాయి. హర్యానా ప్రభుత్వం వీరికి ప్రమోషన్లు కూడా ఇచ్చింది.