క్రీడాభూమి

జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి సిద్ధమవుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువాంటన్, అక్టోబర్ 28: భారత్‌లో జరిగే జూనియర్ ప్రపంచ కప్ టోర్నీకి సిద్ధమవుతున్నట్టు పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) కార్యదర్శి షాబాజ్ అహ్మద్ స్పష్టం చేశాడు. లక్నో వేదికగా జరిగే ఈ టోర్నీలో పాల్గొంటామనే అనుకుంటున్నామని చెప్పాడు. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ తెలిపాడు. భారత్‌కు జట్టును పంపాలా? వద్దా? అన్నది తేల్చిచెప్పాలని పిహెచ్‌ఎఫ్ ఇప్పటికే పాకిస్తాన్ సర్కారుకు లేఖ రాసింది.
ఒక ప్రశ్నపై షాబాజ్ స్పందిస్తూ, భారత్‌లో మ్యాచ్‌కి మాత్రమే ప్రభుత్వ అనుమతి కోరుతున్నామని అనుకోవడానికి వీల్లేదని అన్నాడు. నిజానికి విదేశాల్లో జరిగే ఏ టోర్నీకైనా కొన్ని లాంఛనాలు తప్పవని తెలిపాడు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే జూనియర్ ప్రపంచ కప్ పోటీలకు జట్టును పంపే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తామని అన్నాడు.
డబ్ల్యుటిఎ ఫైనల్స్
సెమీస్‌కు సానియా జోడీ
సింగపూర్, అక్టోబర్ 28: ఇక్కడ జరుగుతున్న డబ్ల్యుటిఎ ఫైనల్స్ టోర్నమెంట్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా సెమీ ఫైనల్స్ చేరంది. కొంతకాలం విరామం తర్వాత మళ్లీ హింగిస్‌తో జోడీ కట్టిన సానియా 7-6, 7-5 తేడాతో హవో చింగ్ చాన్, యుంగ్ జాన్ చాన్ (తైవాన్) జోడీని ఓడించి సెమీస్‌లో స్థానం సంపాదించింది.