క్రీడాభూమి

నాలుగు దేశాల జూనియర్ హాకీ స్పెయిన్‌పై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలెన్షియా, అక్టోబర్ 28: ఇక్కడ జరుగుతున్న నాలుగు దేశాల జూనియర్ హాకీ టోర్నమెంట్ చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. మ్యాచ్ 5వ నిమిషంలోనే పర్వీందర్ సింగ్ భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. అయితే, పది నిమిషాల వ్యవధిలోనే గెరార్డ్ గార్సియా ద్వారా స్పెయిన్‌కు ఈక్వెలైజర్ లభించింది. ఈ గోల్ నమోదైన తర్వాత భారత ఆటగాళ్లు ముమ్మర దాడులకు ఉపక్రమించారు. ఒకవైపు డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇస్తూనే మరోవైపు అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేశారు. 30వ నిమిషంలో నీలకంఠ శర్మ, 41వ నిమిషంలో అర్మాన్ ఖురేషి గోల్స్ సాధించగా, తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ ఆతర్వాత డిఫెన్స్‌కే పరిమితమైంది. స్పెయిన్‌కు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా విజయభేరి మోగించింది.

బిఎఫ్‌ఐకి కేంద్రం గుర్తింపు

న్యూఢిల్లీ, అక్టోబర్ 28: భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. దేశ బాక్సింగ్‌ను పర్యవేక్షించే అధికారం బిఎఫ్‌ఐకి అప్పగిస్తూ అధికారికంగా నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఉన్న బాక్సింగ్ ఇండియా (బిఐ)పై అవినీతి, నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తడంతో దానిని కేంద్రం రద్దు చేసింది. బిఐ స్థానంలో ఏర్పడిన బిఎఫ్‌ఐకి అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) ప్రతినిధి పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా, నిబంధన ప్రకారమే పూర్తికావడంతో, బిఎఫ్‌ఐకి ఈఏడాది చివరిలోగా గుర్తింపునిస్తామని ఎఐబిఎ ఇది వరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే కేంద్రం కూడా అధికారికంగా బిఎఫ్‌ఐని గుర్తించింది.

లిఫ్టింగ్‌లో సైనీకి పతకాలు

పెనాంగ్ (మలేసియా), అక్టోబర్ 28: కామనె్వల్త్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో భారత లిఫ్టర్ శివం సైనీ రెండు పతకాలు సాధించాడు. సీనియర్స్ విభాగంలో రజతాన్ని దక్కించుకున్న అతనికి జూనియర్స్ విభాగంలో స్వర్ణ పతకం లభించింది. 94 కిలోల సీనియర్స్ విభాగంలో పోటీపడిన అతను స్నాచ్‌లో 132, క్లీన్ అండ్ జెర్క్‌లో 168 (మొత్తం 300) కిలోల బరువునెత్తి రెండో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శన అతనికి జూనియర్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని అందించింది.