క్రీడాభూమి

ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ సింధు ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, అక్టోబర్ 28: ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ పివి సింధు ఓటమిపాలైంది. రియో ఒలింపిక్స్‌లో ఆడిన తర్వాత తొలిసారి డెన్మార్క్ ఓపెన్‌లో ఆడిన ఆమె రెండో రౌండ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఆమె రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. చైనాకు చెందిన హి బింగియావోతో జరిగిన మ్యాచ్‌ని ఆమె 20-22, 17-21 తేడాతో చేజార్చుకుంది. సింధు వరుసగా రెండు టోర్నీల్లో రెండో రౌండ్‌లోనే వెనుదిరగడం అభిమానులను నిరాశ పరచింది. ఇలావుంటే, పురుషుల సింగిల్స్ హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా రెండో రౌండ్‌లో ఓడడంతో, ఈ టోర్నీలో భారత్ పోరాటానికి తెరపడింది. చైనీస్ తైపీకి చెందిన చౌ తియెన్ చెన్ చేతిలో అతను 19-21, 16-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు.