క్రీడాభూమి

ఫైనల్‌కు భారత్, పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 29: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో పోరును ఖాయం చేసుకున్నాయి. ఈ రెండు జట్లు శనివారం నాటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లను పెనాల్టీ షూటౌట్‌లో గెల్చుకోవడం విశేషం. దక్షిణ కొరియాను భారత్, మలేసియాను పాక్ ఓడించాయి. తొలి సెమీ ఫైనల్‌లో భారత్‌కు కొరియా గట్టిపోటీనిచ్చింది. 15వ నిమిషంలో తల్వీందర్ సింగ్ భారత ఖాతాను తెరిచాడు. అయితే, 21వ నిమిషంలో సియో ఇన్‌వూ ఈక్వెలైజర్ ద్వారా కొరియాకు ఈక్వెలైజర్ లభించింది. ప్రథమార్ధం ముగిసే వరకూ మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో చాలా సేపు ఇరు జట్లు డిఫెన్స్‌కు ప్రాధాన్యమిచ్చి, ప్రత్యర్థులు గోల్స్ చేయకుండా జాగ్రత్త పడ్డాయి. ఈ డెడ్‌లాక్‌ను 53వ నిమిషంలో కొరియా ఆటగాడు యాంగ్ జీహున్ ఛేదించాడు. అయితే, అతను గోల్ చేసిన రెండు నిమిషాల్లోనే రమణ్‌దీప్ సింగ్ గోల్ సాధించడంతో రెండు జట్ల స్కోర్లు సమమయ్యాయి. నిర్ణీత సమయం ముగిసే వరకూ ఇదే స్కోరు కొనసాగింది. ఎక్‌స్ట్రా టైమ్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాకపోవడంతో షూటౌట్ తప్పలేదు. షూటౌట్‌లో భారత్ తరఫున సర్దార్ సింగ్, మరణ్‌దీప్ సింగ్, రూపీందర్‌పాల్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, బీరేంద్ర లాక్ర గోల్స్ చేశారు. కొరియా తరఫున మొదటి నలుగురు, జంగ్ మన్జాయే, కిమ్ హుయేంగిన్, లీ జంగ్‌జున్, బయే జోంసుక్ తన ప్రయత్నాల్లో సఫలమయ్యారు. కానీ, చివరిలో లీ డరెయో విఫలం కావడంతో కొరియాకు ఓటమి తప్పలేదు.
మలేసియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ రక్షణాత్మక ఆటే ప్రధానంగా మారింది. మ్యాచ్ 18వ నిమిషంలో సాబా షహ్రిల్ మలేసియాకు గోల్ అందించగా, 34వ నిమిషంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్దుల్ ఖాన్ స్కోరును సమం చేశాడు. నిర్ణీత సమయం వరకూ మరో గోల్ నమోదు కాలేదు. పెనాల్టీ షూటౌట్‌లో పాక్ మూడు గోల్స్ చేయగా, మలేసియా రెండు గోల్స్‌కు పరిమితమై నిష్క్రమించింది.
నేడు ఫైనల్
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఎవరికి దక్కుతుందనేది ఆదివారం స్పష్టమవుతుంది. ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు సర్వశక్తులు ఒడ్డి పోరాటం సాగించడం ఖాయం. విజయమే లక్ష్యంగా కొనసాగే ఈ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ రేపుతున్నది. కాగా, మూడో స్థానం కోసం ఆదివారం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్‌లో మలేసియా, కొరియా జట్లు ఢీ కొంటాయి. ఇలావుంటే, నాలుగో స్థానానికి శనివారం జరిగిన పోరులో చైనా 4-3 గోల్స్ తేడాతో జపాన్‌ను ఓడించింది.