క్రీడాభూమి

జయంత్ యాదవ్ కు టీమిండియా క్యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్ నుంచి జయంత్ యాదవ్ టీమిండియా క్యాప్ అందుకున్నాడు. హర్యానాకు చెందిన ఈ యువ స్పిన్నర్ విశాఖపట్నంలో వనే్డతో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య స్థానంలో అతనికి అవకాశం దక్కింది. మ్యాచ్ ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు చేశాడు. అనంతరం నాలుగు ఓవర్లు బౌల్ చేసి, ఎనిమిది పరుగులకు ఒక వికెట్ పడగొట్టాడు. 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లోకి అడుగుపెట్టిన అతను ఇప్పటి వరకూ 42 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 117 వికెట్లు సాధించాడు.
* ఒక వనే్డ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ దారుణ వైఫల్యం ఇదే. 2000లో సింగపూర్‌లో పాకిస్తాన్‌ను ఢీకొన్నప్పుడు ఈ జట్టు 24.4 ఓవర్లలో ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో 23.1 ఓవర్లలోనే కుప్పకూలింది.
* న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. మార్టిన్ గుప్టిల్, బ్రాడ్లే వాల్టింగ్, కొరీ ఆండర్సన్, టిమ్ సౌథీ, ఇష్ సోధీ పరుగుల ఖాతాను తెరవకుండానే వెనుదిరిగారు. ముగ్గురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. కేవలం ముగ్గురు, టామ్ లాథమ్, కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్ మాత్రమే డబుల్ ఫిగర్స్ చేరుకోగలిగారు.

చిత్రం.. జయంత్ యాదవ్‌కు టీమిండియా క్యాప్ పెడుతున్న మాజీ క్రికెటర్ వీరేందర్ సెవాగ్