క్రీడాభూమి

విండీస్ పరువు నిలిపిన బ్రాత్‌వెయట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్జా, నవంబర్ 3: పాకిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్‌ను కోల్పోయనప్పటికీ వెస్టిండీస్‌ను వైట్‌వాష్ నుంచి కార్లొస్ బ్రాత్‌వెయట్ తప్పించి, పరువు నిలిపాడు. చివరిదైన మూడో టెస్టులో విండీస్ 5 వికెట్ల తేడాతో విజ యం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతను నాటౌట్‌గా నిలవడం విశేషం. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 281 పరుగులు చేసిం ది. అందుకు సమాధానంగా వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 337 పరుగులు సాధించింది. బ్రాడ్‌వెయట్ 142 పరు గులతో నాటౌట్‌గా నిలిచాడు. రోస్టన్ చేస్ 50, వికెట్‌కీపర్ షాన్ డౌరిచ్ 47 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో వాహబ్ రియాజ్ 88 పరుగులకు ఐదు, మహమ్మద్ అమీర్ 71 పరుగులకు మూడు చొప్పున వికెట్లు కూల్చారు. అనం తరం పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 208 పరుగులకు ఆలౌ టైంది. అజర్ అలీ (91), సర్ఫ్‌రాజ్ అహ్మద్ (42) తప్ప మి గతా ఆటగాళ్లు క్రీజ్‌లో నిలదొక్కుకోలేకపోయారు. విండీస్ కెప్టెన్ జాసన్ హోల్టర్ కేవలం 30 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి పాక్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. దేవేంద్ర బిషూ 46 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు.
అప్పటికే సిరీస్‌ను చేజార్చుకున్న వెస్టిండీస్ వైట్‌వాష్ నుంచి తప్పించుకోవడానికి 153 పరుగుల విజయ లక్ష్యం తో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, 43.5 ఓవర్లలో ఐదు వి కెట్లు కోల్పోయ 154 పరుగులు చేసి గెలిచింది. మొదటి ఇ న్నింగ్స్ సెంచరీ హీరో బ్రాడ్‌వెయట్ రెండో ఇన్నింగ్స్‌లో నూ రాణించి 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. డౌరిచ్ కూడా అజేయంగా 60 పరుగులు చేశాడు.

చిత్రం.. కార్లొస్ బ్రాత్‌వెయట్