క్రీడాభూమి

బిట్‌బర్గర్ ఓపెన్ బాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్‌కు వర్మ సోదరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్‌బ్రకెన్ (జర్మనీ), నవంబర్ 3: బిట్‌బర్గర్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు సౌరవ్ వర్మ, సమీర్ వర్మ ప్రీ క్వార్టర్స్ చేరారు. ఈ అన్నదమ్ములు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందంజ వేశారు. చైనాకు చెందిన యూ సాంగ్‌తో తలపడిన సౌరవ్ 16-9 ఆధిక్యాన్ని సంపాదించాడు. ఈ దశలో సాంగ్ కండరాల నొప్పితో వైదొలగ్గా, సౌరవ్‌కు ప్రీ క్వార్టర్స్‌లో చోటు దక్కింది. వర్మ సోదరుల్లో చిన్నవాడైన సుమీర్ 21-10, 21-16 స్కోరుతో ఫిన్లాండ్ ఆటగాడు ఇటూ హెనోపై గెలుపొందాడు. మహిళల సింగిల్స్‌లో రుత్విక శివానీ గాదే కూడా ముందంజ వేసింది. దాదాపు ఏక పక్షంగా సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆమె నెదర్లాండ్స్‌కు చెందిన సొరయా డి విచ్ ఎబెర్గన్‌పై 21-11, 21-13 తేడాతో విజయం సాధించింది.