క్రీడాభూమి

నేడు పాక్వియానో చివరి ఫైట్ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ వెగాస్, నవంబర్ 4: ఫిలిప్పీన్స్ బాక్సింగ్ సూపర్ స్టార్ మానీ పాక్వియానో శనివారం జెస్సీ వర్గాస్‌తో జరిగే డబ్ల్యుబివో వెల్టర్‌వెయిట్ ఫైట్‌కు సిద్ధమయ్యాడు. బహుశా అతని కెరీర్‌లో ఇదే చివరి ఫైట్. ఫిలిప్పీన్స్ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత పాక్వియానో బాక్సింగ్ రింగ్‌లోకి దిగడంతో ఈ బౌట్ అందరినీ ఆకట్టుకుంటున్నది. అతను గెలిస్తే, ప్రపంచ బాక్సింగ్ టైటిల్‌ను సాధించిన తొలి సెనెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఈ ఏడాది ఇదే తన చివరి ఫైట్ అని ఇది వరకే ప్రకటించిన పాక్వియానో వచ్చే ఏడాది తాను కెరీర్‌ను కొనసాగించేదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. దీనితో అతనికి ఇదే చివరి ఫైట్ అన్న ప్రచారం జరుగుతున్నది. దీనిని అతను ఖండించకపోవడం విశేషం.

స్టెయిన్ భుజానికి గాయం
క్రికెట్‌కు ఆరు నెలలు దూరం!
పెర్త్, నవంబర్ 4: దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ భుజం గాయంతో బాధపడుతున్నాడు. గత ఏడాది తగిలిన గాయం ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో తిరగబెట్టడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. వైద్య పరీక్షల అనంతరం అతనికి శస్త్ర చికిత్స అవసరమని నిపుణులు తేల్చిచెప్పారు. ఆపరేషన్ కారణంగా అతను కనీసం ఆరు నెలలు క్రికెట్‌కు దూరమవుతాడు. కాగా, ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 242 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. ఆతర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 104 పరుగులు సాధించింది. జీన్ పాల్ డుమినీ 34, డీన్ ఎల్గార్ 46 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.