క్రీడాభూమి

షాట్ సెలక్షన్‌లో పొరపాటే హ్యూస్ మృతికి కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, నవంబర్ 4: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఫిల్ హ్యూస్ మృతికి షాట్ ఎంపికలో అతను చేసిన పొరపాటే కారణమని న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన విచారణ అధికారి మైఖేల్ బర్నెస్ తన నివేదికలో స్పష్టం చేశాడు. 2014 నవంబర్ 25న సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్‌వేల్స్ జట్ల మధ్య షీఫీల్డ్ షీల్డ్ టోర్నీ మ్యాచ్ ఆరంభమైంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆస్ట్రేలియా 48.2 ఓవర్లలో రెండు వికెట్లకు 136 పరుగులు చేసింది. న్యూ సౌత్‌వేల్స్ పేసర్ సీన్ అబోట్ తన పదో ఓవర్ వేస్తున్నాడు. అతను మూడో బంతిని షార్ట్ పిచ్ బాల్‌గా వేశాడు. వేగంగా పైకివచ్చిన ఆ బౌన్సర్‌ను హుక్ షాట్ కొట్టడానికి హ్యూస్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. బంతి అతని హెల్మెట్ గ్రిల్‌ను ఛేదిస్తూ తల, మెడ మధ్య భాగంలో బలంగా తగిలింది. తీవ్రంగా గాయపడిన హ్యూస్ అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆటను నిలిపివేసిన నిర్వాహకులు అతనిని ఆసుపత్రిలో చేర్చారు. కోమాలోకి వెళ్లిపోయిన హ్యూస్ అక్కడ చికిత్స పొందుతూ మూడో రోజు మృతి చెందాడు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. హ్యూస్ మృతికి దారితీసిన పరిస్థితులపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది. న్యూ సౌత్‌వేల్స్ అధికారి బర్నెస్ విచారణను పూర్తి చేసి సమర్పించిన నివేదికలో హ్యూస్ మృతికి ఎవరూ బాధ్యులుకారని తేల్చాడు. షాట్ ఎంపికలో జరిగిన పొరపాటే అతని ప్రాణాలను హరించిందని పేర్కొన్నాడు. తలకు, మెడకు మధ్యన.. చాలా సున్నితమైన భాగంగా బంతి చాలా బలంగా తగిలినందుకే హ్యూస్ మరణించాడని, ఇది కేవలం ప్రమాదమే తప్ప మరొకటి కాదని బర్సెస్ తెలిపాడు. హ్యూస్ ధరించిన హెల్మెట్‌లోనూ పొరపాటు లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానంతో తయారైన హెల్మెట్‌ను పెట్టుకున్నా హ్యూస్ బతికి ఉండేవాడు కాదని తెలిపాడు. గాయం తగిలిన తీరే ఇందుకు నిదర్శనమని అన్నాడు.

బిట్‌బర్గర్ ఓపెన్ బాడ్మింటన్
క్వార్టర్స్‌కు వర్మ సోదరులు
సార్‌బ్రకెన్ (జర్మనీ), నవంబర్ 4: భారత్‌కు చెందిన వర్మ సోదరులు, సౌరవ్, సమీర్ ఇక్కడ జరుగుతున్న బిట్‌బర్గర్ ఓపెన్ బాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరారు. ఇండోనేషియాకు చెందిన వౌలానా ముస్త్ఫా నుంచి ఎదురైన పోటీని సమర్థంగా ఎదుర్కొన్న సౌరవ్ 21-11, 22-20 తేడాతో గెలుపొందాడు. సమీర్ 21-17, 21-17 ఆధిక్యంతో స్కాట్‌లాండ్ ఆటగాడు కీరన్ మెరిలీస్‌పై విజయం సాధించాడు.