క్రీడాభూమి

నేడు పిబిఎల్ ఆటగాళ్ల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: కాసుల పంట పండిస్తున్న ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) రెండో ఎడిషన్ టోర్నమెంట్ కోసం బుధవారం ఇక్కడ ఆటగాళ్లను వేలం వేయనున్నారు. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్, రియో ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), రజత పతక విజేత పివి.సింధు సహా పలువురు టాప్ షట్లర్లు ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే 16 మంది ఒలింపిక్ పతక విజేతల్లో మారిన్, సింధుతో పాటు డెన్మార్క్‌కు చెందిన ఒలింపిక్ కాంస్య పతక విజేత విక్టర్ అక్సెల్‌సెన్ కూడా ఉన్నాడు. గతంలో ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) పేరుతో నిర్వహించిన ఈ టోర్నీని ఇక నుంచి పిబిఎల్ పేరుతో నిర్వహించనున్నారు. అయితే చైనా, జపాన్‌లకు చెందిన టాప్ షట్లర్లు ఈసారి ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. వారంతా దేశవాళీ టోర్నమెంట్లలో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. మొత్తం 15 రోజుల పాటు జరిగే పిబిఎల్ టోర్నీలో ఆరు జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలో అత్యధిక ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న బాడ్మింటన్ టోర్నీ ఇదే. మొత్తం 6 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఢిల్లీ ఏసర్స్, ముంబయి రాకెట్స్, చెన్నై స్మాషర్స్, హైదరాబాద్ హంటర్స్, అవధ్ వారియర్స్, బెంగళూరు బ్లాస్టర్స్ (గతంలో ఈ జట్టు పేరు బెంగళూరు టాప్ గన్స్) జట్లు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.