క్రీడాభూమి

ఇగ్లాండ్‌తో ఒక్కో టెస్టుకు రూ.58.66 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య బుధవారం రాజ్‌కోట్‌లో మొదలయ్యే తొలి మ్యాచ్ నిర్వహణ కోసం 58.66 లక్షల రూపాయలు ఖర్చు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)కి స్పష్టం చేసింది. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే ఇతర మ్యాచ్‌లకు కూడా బిసిసిఐ ఇంతే మొత్తం చొప్పున ఖర్చు చేసుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్‌ల నిర్వహణకు అయ్యే ఖర్చులను బిసిసిఐ భరించేందుకు సుప్రీం కోర్టు అనుమతిస్తూ, బోర్డు కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆటగాళ్ల భత్యాలు, బీమా వ్యయాలు, థర్డ్ అంపైరకు వేతన చెల్లింపుల కోసమే ఈ మొత్తాలను విడుదల చేయాలని, అంతేతప్ప రాజ్‌కోట్/సౌరాష్ట్ర క్రికెట్ సంఘానికి (ఎస్‌సిఎ) విడుదల చేయవద్దని తేల్చిచెప్పింది.