క్రీడాభూమి

ఈ సిరీస్ మాకు చాలా కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 8: మూలపాడులో ఈ నెల 10 నుండి 22వ తేదీ వరకు జరుగనున్న భారత్, వెస్టెండీస్ సిరీస్ భారత్‌కు చాలా కీలకమని భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ అన్నారు. మంగళవారం నగరంలోని హోటల్‌గేట్‌వేలో జరిగిన మీడియా సమావేశంలో మిథాలీరాజ్ మాట్లాడుతూ ఈ సిరీస్ గెలిస్తే జూన్ 2017లో జరుగనున్న ప్రపంచకప్ మహిళా క్రికెట్ కప్‌కు అర్హత సాధించడం సులభమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారతజట్టు మంచి ఫామ్‌లో ఉందని, మూలపాడు క్రికెట్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని తెలిపారు. ఇరు జట్లకు పిచ్ వాతావరణం లభిస్తుందన్నారు.
నేడు భారత్, వెస్టిండీస్ జట్లను కలవనున్న సిఎం
మూలపాడులో ఈ నెల 10 నుండి జరుగనున్న భారత్, వెస్టిండీస్ మహిళా క్రికెట్ సిరీస్‌లో పాల్గొననున్న ఇరుజట్ల సభ్యులను బుధవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిచయం చేసుకోనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) కార్యదర్శి, బిసిసిఐ ఉపాధ్యక్షులు జి గంగరాజు తెలిపారు. మూలపాడు క్రికెట్ స్టేడియంకు డా గోకరాజు లైలా గంగరాజు ఎసిఎ క్రికెట్ కాంప్లెక్‌గా నామకరణం చేయడం జరుగుతుందని, ఈ కాంప్లెక్స్‌లో ఉన్న రెండు మైదానాలకు విడివిడిగా దేవినేని వెంకట రమణ ప్రణీత ప్లే గ్రౌండ్, చుక్కపల్లి పిచ్చయ్య ప్లే గ్రౌండ్‌గా ముఖ్యమంత్రి నామకరణం చేస్తారని ఆయన పేర్కొన్నారు.