క్రీడాభూమి

జోరుగా.. హుషారుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, నవంబర్ 8: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య హోరాహోగా జరుగుతుందని భావిస్తున్న ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్ బుధవారం ఇక్కడ ప్రారంభం కానుంది. ఇటీవల వెస్టిండీస్, న్యూజిలాండ్‌లపై వరుసగా విజయాలను నమోదు చేయడంతో పాటు ప్రపంచ టెస్టు క్రికెట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న భారత జట్టు ఈ సిరీస్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. భారత గడ్డపై ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ టెస్టు సిరీస్ జరగడం మూడు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి కాగా, టెస్టు మ్యాచ్‌కు రాజ్‌కోట్ ఆతిథ్యమిస్తుండటం ఇదే తొలిసారి. ప్రస్తుతం భారత జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నప్పటికీ నాలుగేళ్ల క్రితం స్వదేశంలో టీమిండియాతో జరిగిన సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాడ్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా ఎదురు చూస్తుండటంతో ప్రస్తుత సిరీస్‌లో పోరు హోరాహోరీగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2012లో జరిగిన నాలుగు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభంలో ఇంగ్లాండ్ జట్టుకు ఓటమి ఎదురైనప్పటికీ ఆ తర్వాత అనూహ్య రీతిలో విజృంభించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే అప్పట్లో ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్లు గ్రేమ్ స్వాన్, మాంటీ పనేసర్‌తో పాటు వివాదాస్పద బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ ప్రస్తుతం పర్యాటక జట్టులో లేకపోవడం ప్రధానాంశాలు.
నాలుగేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమిపాలవడంతో పాటు ఆ తర్వాత మరో రెండేళ్లకు ఇంగ్లాండ్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో 3-1 తేడాతో పరాజయం పాలైన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ప్రస్తుత టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ పాఠాలను ఇప్పటికీ మరువలేదు.
అయితే ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఇటీవల బంగ్లాదేశ్‌లో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఢాకాలో జరిగిన పోరులో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొని ఆ తర్వాత 1-1 తేడాతో ఆ సిరీస్‌ను డ్రాగా ముగించిన విషయం తెలిసిందే. అలాగే వారం రోజుల క్రితం భారత్‌కు చేరుకున్న ఇంగ్లాండ్ జట్టు అప్పటి నుంచి ఒక్క సన్నాహక మ్యాచ్ కూడా ఆడలేదు. దీనికి తోడు టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఇంగ్లాండ్ బౌలర్‌గా చరిత్ర సృష్టించిన జేమ్స్ ఆండర్సన్ భుజం గాయం కారణంగా అందుబాటులో లేకపోవడం పర్యాటక జట్టుకు మరో ప్రతికూల అంశం. దీంతో భారత జట్టుపై, ప్రత్యేకించి విరాట్ కోహ్లీ సారథ్యంలో దూకుడును కొనసాగిస్తున్న జట్టుపై తాము ఈ సిరీస్‌లో ‘అండర్‌డాగ్స్’గానే బరిలోకి దిగుతున్నామని ప్రస్తుతం 100వ టెస్టు ఆడబోతున్న ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఆలిస్టర్ కుక్, ఆల్‌రౌండర్ స్టూవర్ట్ బ్రాడ్ ఇప్పటికే అంగీకరించగా, పర్యాటక జట్టుపై పేలవంగా ఉన్న తన బ్యాటింగ్ రికార్డును మెరుగుపర్చుకోవాలని కోహ్లీ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. మరోవైపు ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసి ప్రస్తుత హోమ్ సీజన్‌ను దిగ్విజయంగా ప్రారంభించిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లోనూ అదేవిధమైన వ్యూహాలను అమలుపర్చాలని కోచ్ అనిల్ కుంబ్లే ఆకాంక్షిస్తున్నాడు. కొద్ది మంది కొత్త సభ్యులతో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు పట్ల ఏమాత్రం ఉదాసీనంగా వ్యవహరిచినా తీవ్రమైన ప్రమాదాలు ముంచుకొస్తాయని టీమిండియా వైస్-కెప్టెన్ అజింక్యా రహానే ఇప్పటికే తన సహచర ఆటగాళ్లకు స్పష్టం చేశాడు.
కాగా, చాలా కాలం నుంచి బిసిసిఐ వ్యతిరేకిస్తున్న డిఆర్‌ఎస్ (డెసిషన్ రివ్యూ సిస్టమ్)ను ఈ సిరీస్‌లో ఉపయోగించనున్నారు. డిఆర్‌ఎస్‌తో భారత్‌లో నిర్వహిస్తున్న తొలి టెస్టు సిరీస్ ఇదే. ఎనిమిదేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన ఒకే ఒక్క సిరీస్‌లో మినహా టెస్టుల్లో భారత జట్టుకు డిఆర్‌ఎస్ పట్ల సరైన అవగాహన లేదు. దీంతో ప్రస్తుత సిరీస్‌లో ఈ విధానాన్ని ఎలా అనుసరించాలన్న దానిపై వ్యూహాలను రచించుకోవడంలో టీమిండియా బిజీగా ఉంది. ఇంగ్లాండ్‌తో 2012లో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ఎదురైన ఓటమి తర్వాత స్వదేశంలో వరుసగా 14 మ్యాచ్‌లలో అజేయంగా నిలిచిన భారత జట్టు ప్రస్తుతం మంచి బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉంది. గాయాలతో లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ దూరమైనపప్పటికీ కోహ్లీ, రహానే, మురళీ విజయ్, సీనియర్ ఆటగాడు గౌతమ్ గంభీర్, చటేశ్వర్ పుజారా తదితర ఆటగాళ్లతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉండటం భారత జట్టుకు ఎంతో సానుకూల అంశం. ఇటీవల న్యూజిలాండ్‌తో వనే్డ సిరీస్ సందర్భంగా రోహిత్ శర్మకు గాయమవడంతో అతని స్థానంలో కర్నాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ లేదా బరోడా ఆల్‌రౌండ్ హార్దిక్ పాండా టెస్టుల్లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇరు జట్ల వివరాలు ఇవీ
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, గౌతమ్ గంభీర్, చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (వైస్-కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మహమ్మద్ షమీ, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కరుణ్ నాయర్, జయంత్ యాదవ్.
ఇంగ్లాండ్: ఆలిస్టర్ కుక్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జాక్ బాల్, గారీ బల్లాన్స్, గారెత్ బాటీ, స్టూవర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, బెన్ డకెట్, స్టీవెన్ ఫిన్, హసీబ్ హమీద్, మొరుూన్ అలీ, జఫర్ అన్సారీ, ఆదిల్ రషీద్, జో రూట్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్.