క్రీడాభూమి

బిసిసిఐ ఎత్తుగడ ఏమిటో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: లోధా సిఫార్సులను అమలు చేయకుండా మరికొంత కాలం వాయిదా వేయడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అనుసరించబోయే కొత్త ఎత్తుగడ ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ప్రతిపాదనలను అమలు చేస్తామంటూ అఫిడవిట్‌ను దాఖలు చేస్తే తప్ప సభ్య సంఘాలకు ఎలాంటి చెల్లింపులు జరపరాదని లోధా కమిటీ ఇంతకు ముందు జారీ చేసిన ఆదేశాలను సాకుగా చూపి, ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయంటూ బోర్డు రాద్ధాంతం చేసింది. అయితే, ఇంగ్లాండ్ సిరీస్‌లో ఒక్కో టెస్టుకు 58.66 లక్షల రూపాయలు చెల్లించవచ్చంటూ సుప్రీం కోర్టు అనుమతినివ్వడంతో బోర్డు పరిస్థితి గందరగోళంలో పడింది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా తప్పించుకోవడానికి బిసిసిఐ ఇంత వరకూ చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు చెక్ పెడుతునే ఉంది. టెస్టుల నిర్వాహణకు నిధులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా బోర్డు అధికారులను మరోసారి దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టింది. ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసును, బిసిసిఐలో జరుగుతున్న అవినీతిని పలు సందర్భాల్లో ఎండగట్టిన సుప్రీం కోర్టు అదే తరహా నిర్ణయాలతో ముందుకెళుతున్నది. భారత క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచాలన్న నిర్ణయానికి సుప్రీం కోర్టు వచ్చినట్టు ఇప్పటి వరకూ జారీ చేసిన ఆదేశాలే స్పష్టం చేస్తున్నాయి. లోధా కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రతిపాదనలను అమలు చేయడానికి వెనుకంజ వేస్తున్న బిసిసిఐ ఇప్పుడు ప్రభుత్వ ప్రతినిధులను ఆశ్రయించడం ద్వారా లాభపడాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ బిజెపి పార్లమెంటు సభ్యుడు కావడంతో ఇంతకు మించిన మార్గం లేదన్న వాదన బలపడుతున్నది. ప్రజా ప్రతినిధుల ద్వారా పార్లమెంటులో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు బోర్డు ప్రయత్నిస్తున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోధా కమిటీ సిఫార్సుల్లో ఎక్కడా బిసిసిఐపై ప్రభుత్వ ఆజమాయిషీకి ఆస్కారం లేదన్నది వాస్తవం. అందుకే, ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని బిసిసిఐ ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో క్రీడా బిల్లును ఆమోదిస్తే తప్ప, బిసిసిఐపై కేంద్రానికి పట్టు సాధ్యం కాదు. సుప్రీం కోర్టులో కేసు లేకపోతే, పార్లమెంటును కూడా బిసిసిఐ ప్రభావితం చేసి ఉండేదని కూడా విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే, క్రీడా బిల్లును ఎక్కడా లొసుగులు లేకుండా రూపొందించి, దానికి పార్లమెంటులో ఆమోద ముద్ర పడేలా చూడాలని కేంద్రానికి సూచిస్తున్నారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టేలా చేయడం తప్ప లోధా కమిటీ సిఫార్సుల అమలు నుంచి తప్పించుకోవడానికి బోర్డుకు మరో మార్గం లేదన్న వాదన బలంగా వినిపిస్తున్నది.