క్రీడాభూమి

ద్వైపాక్షిక సిరీస్ ఆడతారా? లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 9: ద్వైపాక్షిక సిరీస్ ఆడేదీ లేనిదీ తేల్చిచెప్పాలని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) డిమాండ్ చేసింది. 2007 నుంచి ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగని విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించిన షెడ్యూల్‌ను అమలు చేయాలని బిసిసిఐని పదేపదే అడుగుతున్న పిసిబి ఏదో ఒకటి తేల్చాలని కోరింది. ఐసిసి సమావేశానికి వెళ్లినప్పుడు బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను కలిసి, ద్వైపాక్షిక సిరీస్‌పై చర్చించానని పిసిబి మాజీ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రస్తుత చీఫ్ నజాం సేథీ అన్నాడు. కానీ, అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. వచ్చే క్యాలెండర్ ఇయర్ సమీపిస్తున్న తరుణంలో, ఇప్పటికైనా ఏదో ఒకటి స్పష్టం చేయాల్సిన బాధ్యత బిసిసిఐపై ఉందన్నాడు.