క్రీడాభూమి

17న హఫీజ్‌కు బౌలింగ్ పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, నవంబర్ 9: నిబంధనలకు విరుద్ధమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాత్కలిక సస్పెన్షన్‌కు గురైన పాకిస్తాన్ ఆల్‌రౌండర్ మహమ్మద్ హఫీజ్ ఈనెల 17న బ్రిస్బెన్‌లో బయో మెట్రిక్ పరీక్షకు హాజరవుతాడు. అక్కడ వచ్చే ఫలితంపైనే హఫీజ్ కె రీర్ ఆధారపడి ఉంటుంది. గుర్తింపు పొందిన కేంద్రం కాబట్టే, అక్కడి నివేదికపై ఆధారపడి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) నిర్ణయం తీసుకుంటుంది. నిజానికి అతనిపై విధించిన సస్పెన్షన్ వేటు జూలై మాసంతోనే పూర్తయంది. కానీ, మోకాలి నొప్పితో బాధపడుతున్న కార ణంగా అతను అప్పుడు బయో మెట్రిక్ పరీక్షకు వెళ్లలేకపోయాడు.

చెనె్నయన్‌కు ఢిల్లీ షాక్

న్యూఢిల్లీ, నవంబర్ 9: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భా గంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెనె్నయన్‌కు ఢిల్లీ డైనమోస్ షా కిచ్చింది. 4-1 గోల్స్ తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఫ్లోరెంట్ మలోదా రెండు గోల్స్ సాధించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిచర్డ్ గాడ్జ్, కీన్ లూయస్ చెరొక గోల్ చేశారు. చెనె్నయన్ తరఫున ఆ జట్టు కెప్టెన్ బెనార్డ్ మేండే గోల్ చేశాడు.

ఓటమి అంచున జింబాబ్వే

హరారే, నవంబర్ 9: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో జింబాబ్వే ఓటమి అంచున నిలిచింది. 491 పరుగుల అసాధ్యమైన విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఈ జట్టు నాలుగోరోజు, బుధవారం ఆట ముగిసే సమయానికి 180 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయంది. ఇంకా 311 పరుగులు చేయాల్సి ఉండగా, మూడు వికెట్లే చేతిలో ఉన్నాయ.