క్రీడాభూమి

మారిన్‌కు భారీ ధర (ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: రియో ఒలింపిక్స్ మహిళల ఫైనల్‌లో భారత స్టార్ పివి సింధును ఓడించి టైటిల్ సాధించిన స్పెయిన్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్‌కు బుధవారం ఇక్కడ జరిగిన 2017 ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) వేలంలో భారీ ధర పలికింది. నిరుటి వేలంలో అందరి కంటే ఎక్కువ మొత్తాన్ని దక్కించుకున్న 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, హైదరాబాదీ సైనా నెహ్వాల్‌కు డిమాండ్ తగ్గింది. రియోలో కాంస్య పతకం సాధించిన సింధుకు కూడా అభిమానులు ఆశించిన మొత్తం దక్కలేదు. కాగా, భారతీయుల్లో హైదరాబాద్ యువ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ టాపర్‌గా నిలిచాడు.
మారిన్‌ను హైదరాబాద్ హంటర్స్ జట్టు 61.5 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈసారి పిబిఎల్ వేలంలో ఇదే అత్యధిక ధర. భారత్ తరఫున ఐకాన్ క్రీడాకారిణు జాబితాలో ఉన్న తెలుగు తేజం సింధుకు భారీ మొత్తం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఆమెకు కేవలం 39 లక్షల రూపాయల ధరే పలికింది. ఆమెను చెన్నై స్మాషర్స్ దక్కించుకుంది. కాగా, నిరుడు అందరి కంటే ఎక్కువ ధరతో సంచలనం సృష్టించిన సైనాను ఈసారి మొదటి రౌండ్ బిడ్డింగ్‌లో పాడుకోవడానికి ఎవరూ ఆసక్తిని ప్రదర్శించలేదు. నిరుడు ఆమెను భారీ మొత్తానికి కొన్న అవాధే వారియర్స్ రెండో రౌండ్‌లో ఆమెకు 33 లక్షల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించింది. ఇలావుంటే, మహిళల విభాగంలో రెండో అత్యధిక మొత్తం కొరియాకు చెందిన సంగ్ జీ హ్యున్‌కు లభించింది. ముంబయి రాకెట్స్ జట్టు ఆమెను 60 లక్షల రూపాయలకు ముంబయి రాకెట్స్ జట్టు కొనింది.
పురుషుల విభాగంలో డెన్మార్క్‌కు చెందిన జాన్ ఒజొర్గెనె్సన్‌కు టాప్ బిడ్డింగ్ దక్కింది. అతనిని డిఫెండింగ్ చాంపియన్ డిల్లీ ఏసర్స్ 59 లక్షలకు కొనుగోలు చేసింది. భారత షట్లర్లలో అత్యధికంగా శ్రీకాంత్ 51 లక్షల రూపాయల ధర పలికాడు. అతనిని అవాధే వారియర్స్ దక్కించుకుంది. డెన్మార్క్‌కే చెందిన రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత విక్టర్ అక్లెల్సెన్‌ను బెంగళూరు బ్లాస్టర్స్, వాన్ హో సన్‌ను ఢిల్లీ ఏసర్స్ జట్టు చెరి 39 లక్షల రూపాయలకు కొన్నాయి.