క్రీడాభూమి

మహిళల క్రికెట్ విండీస్‌పై భారత్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 10: మహిళల వనే్డ క్రికెట్ సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో గురువారం ఇక్కడి దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ బోణీ చేసింది. ఇంకా 65 బంతులు మిగిలి ఉండగానే, ప్రత్యర్థిని ఆరు వికెట్ల తేడాతో చిత్తుచేసి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించగా, వేదా కృష్ణమూర్తి అర్ధ శతకంతో రాణించి తన వంతు పాత్ర పోషించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 42.4 ఓవర్లలో 131 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ హీలీ మాథ్యూస్ (24), కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ (19), వికెట్‌కీపర్ మెరిసా ఆక్విలెరియా (42 నాటౌట్) తప్ప ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ 21 పరుగులకు నాలుగు వికెట్లు సాధించింది. ఎక్తా బిస్త్ 31 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు దీప్తి శర్మ (16), స్మృతి మందానా (7), మోనా మెష్రామ్ (2) తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో ఎదురుదెబ్బ తగిలింది. టి-20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఎంపికైన హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం ఒక పరుగుకే అవుటైంది. అయితే, వికెట్లు కూలుతున్నప్పటికీ, కెప్టెన్ మిథాలీ రాజ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు క్రీజ్‌లో నిలదొక్కుకొని స్కోరుబోర్డును ముందుకు కదిలించింది. వేదా కృష్ణమూర్తి వేగంగా పరుగులు సాధించడంతో 39.1 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లకు 133 పరుగులు చేసి, విజయభేరి మోగించింది. ఆరు వికెట్ల తేడాతో ఈ విజయాన్ని నమోదు చేసే సమయానికి మిథాలీ రాజ్ 46 (91 బంతులు, ఆరు ఫోర్లు), వేదా కృష్ణమూర్తి 52 (70 బంతులు, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. విండీస్ బౌలర్ షకీరా సెల్మాన్ 11 పరుగులకు రెండు వికెట్లు కూల్చింది.