క్రీడాభూమి

జింబాబ్వేతో టెస్టు సిరీస్ శ్రీలంక క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, నవంబర్ 10: జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌స్వీప్ చేసింది. చివరిదైన రెండో టెస్టును ఏకంగా 257 పరుగుల భారీ తేడాతో గెల్చుకొని, 2-0 ఆధిక్యంతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 504 పరుగులు సాధించిన శ్రీలంక ఆతర్వాత జింబాబ్వేను మొదటి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడి, తొమ్మిది వికెట్లకు 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీనితో విజయానికి 491 పరుగుల అసాధ్యమైన లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే, నాలుగో రోజు, బుధవారం ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. చివరి రోజైన గురువారం ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి 233 పరుగులకు ఆలౌటైంది. ఎర్విన్ (72), సీన్ విలియమ్స్ (45) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ రాణించలేకపోవడంతో జింబాబ్వేకు పరాభవం తప్పలేదు. లంక బౌలర్లలో రంగన హెరాత్ 63 పరుగులకే ఎనిమిది వికెట్లు పడగొట్టి జింబాబ్వే ఓటమికి కారణమయ్యాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా కరుణరత్నే ఎంపికయ్యాడు.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 144.4 ఓవర్లలో 504 ఆలౌట్ (ఉపుల్ తరంగ 79, ధనంజయ డిసిల్వ 127, అసెలా గుణరత్నే 116, డొనాల్డ్ తిరిపానో 3/91, గ్రేమ్ క్రెమర్ 3/136).
జింబాబ్వే తొలి ఇన్నింగ్స్: 82.1 ఓవర్లలో 272 ఆలౌట్ (బ్రియాన్ చారి 80, క్రెగ్ ఇర్విన్ 64, సీన్ విలియమ్స్ 58, రంగన హెరాత్ 5/89, దిల్‌రువాన్ పెరెరా 3/51).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 81.4 ఓవర్లలో 9 వికెట్లకు 258 డిక్లేర్డ్ (దిముత్ కరుణరత్నే 88, అసెలా గుణరత్నే 39, కుశాల్ పెరెరా 62, గ్రేమ్ క్రెమర్ 4/91, కార్ల్ ముంబా 3/67).
జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 491): 58 ఓవర్లలో 233 ఆలౌట్ (క్రెగ్ ఇర్విన్ 72, సీన్ విలియమ్స్ 45, రంగన హెరాత్ 8/63).