క్రీడాభూమి

విదేశీ కోచ్‌ల నియామకంలో సర్కారుదే నిర్ణయాధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 10: జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్‌ఎస్‌ఎఫ్) విదేశీ కోచ్‌లను నియమించుకోవడంపై నిర్ణయాధికారం ప్రభుత్వానిదేనని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పలువురు క్రీడా ప్రముఖులతో ‘చింతక్ భైటక్’లో పాల్గొన్నారు. ఏస్ షూటర్ గగన్ నారంగ్, హాకీ మాజీ ఆటగాళ్లు విరేన్ రస్క్విన్హా, జగ్బీర్ సింగ్‌తోపాటు భారత క్రీడా సాధికారిక సంస్థ (సాయ్)కి చెందిన మాజీ డైరెక్టర్ జనరల్స్ హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు గోయల్ తెలిపారు. నాలుగు గంటల పాటు కొనసాగిన సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ క్రీడా సమాఖ్యలను మరింత జవాబుదారీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. విదేశీ కోచ్‌ల నియామకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని ఎన్‌ఎస్‌ఎఫ్‌లు అమలుచేసి తీరాలని తేల్చిచెప్పారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఎక్కువ సంఖ్యలో పతకాలను సాధించే రీతిలో క్రీడాకారులను సిద్ధం చేయడానికి ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అందులో భాగంగానే మాజీ క్రీడాకారులు, క్రీడాధికారులతో చర్చిస్తున్నామని, వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాల ప్రకారం ఎన్‌ఎస్‌ఎఫ్‌ల జవాబుదారీతనం చాలా తక్కువగా ఉందని చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై వైఫల్యాలు ఎదురుకావడం నుంచి అవినీతి ఆరోపణల వరకు ఎన్నో సమస్యలు తెరపైకి వస్తున్నాయని గుర్తుచేశారు. దీనికితోటు విదేశీయులను కోచ్‌గా నియమించుకునే సమయంలో ప్రభుత్వ ఆమోదం లాంఛనంగా మారిందన్నారు. ఈ దుస్థితి నుంచి భారత క్రీడా రంగాన్ని రక్షించి, అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్న్నుదని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న కోచ్‌లకు 50,000 నుంచి రెండు లక్షల రూపాయల వరకు పారితోషికాన్ని చెల్లిస్తున్నట్టు చెప్పారు. విదేశీ కోచ్‌లు అవసరం అనుకుంటే, ముందుగా ప్రకటన జారీ చేసి, ఆతర్వాతే నియామకాలు జరపాలని స్పష్టం చేశారు. గురువారం నాటి సమావేశంలో క్రీడాభివృద్ధికి ఎన్నో ప్రతిపాదనలు, సూచనలు అందాయని అన్నారు. అందరి ఆలోచనలను, సలహాలను పరిగణలోకి తీసుకొని, ఉత్తమ క్రీడా విధానాన్ని అమలు చేస్తామని గోయల్ అన్నారు.