క్రీడాభూమి

రెండో వనే్డ నుంచి మార్ష్‌కు విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, జనవరి 12: భారత్‌తో ఈనెల 15న ఇక్కడ జరిగే రెండో వనే్డ నుంచి మిచెల్ మార్ష్‌కు విశ్రాంతినివ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) నిర్ణయించింది. అతని స్థానంలో జాన్ హాస్టింగ్స్‌ను జట్టులోకి తీసుకోనున్నట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల కాలంలో మార్ష్ అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడుతున్నాడని, అతనికి విశ్రాంతినివ్వడం అత్యవసరమని పేర్కొంది. అందుకే రెండో వనే్డలో అతనికి బదులు హాస్టింగ్స్‌కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు వివరించింది. మార్ష్ స్థానాన్ని హాస్టింగ్ సమర్థంగా భర్తీ చేస్తాడని ధీమా వ్యక్తం చేసింది.