క్రీడాభూమి

అశ్విన్ స్పిన్ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 19: అశ్విన్ స్పిన్ మాయకు ఎంతటి సమర్థులైనా చిత్తుకాక తప్పదని మరోసారి రుజువైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలోనూ అతను అద్వితీయ ప్రతిభ కనబరిచాడు. అతను మొత్తం ఐదు వికెట్లు సాధించడంతో, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే కుప్పకూలింది. అంతకు ముందు, తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు సాధించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆరంభంచి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 98 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 298 పరుగులకు చేరుకోగా, ఇంకా ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో జట్టును ఆదుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్‌లో 13వ టెస్టు హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతను 56, తోడుగా ఆజింక్య రహానే (22) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 122 పరుగులు చేసిన ఇంగ్లాండ్ మూడో రోజు ఉదయం ఆటను కొనసాగించి, 190 పరుగుల వద్ద జానీ బెయిర్ స్టో వికెట్‌ను కోల్పోయింది. బెన్ స్టోక్స్‌తో కలిసి ఆరో వికెట్‌కు 110 పరుగులు జోడించిన అతను 53 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత కొద్ది సేపటికే స్టోక్స్ వికెట్ కూడా కూలింది. అతను 157 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. బెయిర్‌స్టో, స్టోక్స్ వికెట్లు పడిన తర్వాత ఇంగ్లాండ్ కోలుకోలేకపోయింది. చివరిలో అదిల్ రషీద్ (32 నాటౌట్) కొంత సేపు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించినప్పటికీ, టెయిలెండర్లు పోరాటాన్ని కొనసాగించలేకపోయారు. జాఫర్ అన్సారీ (4), స్టువర్ట్ బ్రాడ్ (13), జేమ్స్ ఆండర్సన్ (0) ఏ మాత్రం ప్రతిఘటన ఇవ్వకుండానే వెనుదిరగడంతో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌కు 102.5 ఓవర్లలో 255 పరుగుల వద్ద తెరపడింది. భారత్ కంటే ఆ జట్టు ఏకంగా 200 పరుగులు వెనుకబడింది. అశ్విన్ 67 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 129.4 ఓవర్లలో 455 ఆలౌట్ (చటేశ్వర్ పుజారా 119, విరాట్ కోహ్లీ 167, అశ్విన్ 58, జయంత్ యాదవ్ 35, జేమ్స్ ఆండర్సన్ 3/62, అదిల్ రషీద్ 2/110, మోయిన్ అలీ 3/98).
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 5 వికెట్లకు 103): అలస్టర్ కుక్ బి మహమ్మద్ షమీ 2, హసీబ్ హమీద్ రనౌట్ 13, జో రూట్ సి ఉమేష్ యాదవ్ బి అశ్విన్ 53, బెన్ డకెట్ బి అశ్విన్ 5, మోయిన్ అలీ ఎల్‌బి జయంత్ యాదవ్ 1, బెన్ స్టోక్స్ ఎల్‌బి అశ్విన్ 70, జానీ బెయిర్‌స్టో బి ఉమేష్ యాదవ్ 53, అదిల్ రషీద్ 32 నాటౌట్, జాఫన్ అన్సారీ ఎల్‌బి రవీంద్ర జడేజా 4, స్టువర్ట్ బ్రాడ్ ఎల్‌బి అశ్విన్ 13, జేమ్స్ ఆండర్సన్ ఎల్‌బి అశ్విన్ 0, ఎక్‌స్ట్రాలు 9, మొత్తం (102.5 ఓవర్లలో ఆలౌట్) 255.
వికెట్ల పతనం: 1-4, 2-51, 3-72, 4-79, 5-80, 6-190, 7-225, 8-234, 9-255, 10-255.
బౌలింగ్: మహమ్మద్ షమీ 14-5-28-1, ఉమేష్ యాదవ్ 18-2-56-1, రవీంద్ర జడేజా 29-10-57-1, అశ్విన్ 29.5-6-67-5, జయంత్ యాదవ్ 12-3-38-1.
భారత్ రెండో ఇన్నింగ్స్: మురళీ విజయ్ సి జో రూట్ బి స్టువర్ట్ బ్రాడ్ 3, లోకేష్ రాహుల్ సి జానీ బెయిర్‌స్టో బి స్టువర్ట్ బ్రాడ్ 10, చటేశ్వర్ పుజారా బి జేమ్స్ ఆండర్సన్ 1, విరాట్ కోహ్లీ 56 నాటౌట్, రహానే 22 ఆలౌట్, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (34 ఓవర్లలో 3 వికెట్లకు) 98.
వికెట్ల పతనం: 1-16, 2-17, 3-40.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 8-1-16-1, స్టువర్ట్ బ్రాడ్ 6-5-6-2, అదిల్ రషీద్ 12-1-37-0, బెన్ స్టోక్స్ 5-0-25-0.

చిత్రం.. అశ్విన్