క్రీడాభూమి

సిరీస్ విండీస్ కైవసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 20: భారత్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల మహిళల టి-20 సిరీస్‌ను, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వెస్టిండీస్ కైవసం చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో ఓడిన హర్మన్‌మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్ ఆదివారం నాటి రెండో టి-20లోనూ విఫలమై, 31 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. దీనితో సిరీస్‌ను విండీస్ సొంతం చేసుకోగా, మంగళవారం జరిగే చివరి, మూడో మ్యాచ్‌కి ఎలాంటి ప్రాధాన్యం లేకుండాపోయింది. విండీస్ కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ 47 పరుగులు చేసి తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ప్రతిభ కారణంగా విండీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 137 పరుగులు చేసింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 43 పరుగులు సాధించినప్పటికీ, మిగతా వారి సహకారం లేకపోవడంతో జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయింది. భారత్ 19.1 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది.
టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు హీలీ మాథ్యూస్‌తో కలిసి స్ట్ఫోనీ 35 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది. 28 బంతుల్లో 27 పరుగులు చేసిన హీలీని హర్మన్‌ప్రీత్ క్యాచ్ అందుకోగా శిఖా పాండే అవుట్ చేసింది. బ్రిట్నీ కూపర్ కేవలం ఐదు పరుగులు చేసి, దీప్తి శర్మ బౌలింగ్‌లో డెబ్యుడెంట్ మేఘనా సింగ్‌కు దొరికిపోయింది. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దియేంద్ర డాటిన్ తన కెప్టెన్ స్ట్ఫోనీతో కలిసి మూడో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించిన తర్వాత శిఖా పాండే బౌలింగ్‌లో అనుజా పాటిల్ క్యాచ్ పట్టగా అవుటైంది. ఆమె 21 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లతో 35 పరుగులు చేసింది. కాగా, ఎక్తా బిస్త్ వేసిన చివరి ఓవర్ చివరి రెండు వికెట్లు కూలాయి. 17 బంతుల్లోనే, రెండు ఫోర్లతో 21 పరుగులు చేసిన మెరిస్సా అగిలేరా 20వ ఓవర్ ఐదో బంతికి రనౌటైంది. చివరి బంతిలో స్ట్ఫోనీ వికెట్ కూడా కూలింది. 78 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి, 46 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్ల సాయంతో 47 పరుగులు చేసిన ఆమె ఝూలన్ గోస్వామి క్యాచ్ అందుకోగా అవుటైంది. విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 137 పరుగులు చేయగా, అప్పటికి వికెట్‌కీపర్ కైసియా నైట్ పరుగుల ఖాతా తెరవకుండా నాటౌట్‌గా ఉంది.
భారత కెప్టెన్ ఒంటరిపోరు
విండీస్‌ను ఓడించి, సిరీస్‌పై ఆశలను సజీవంగా నిలబెట్టుకోవడానికి 138 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తప్ప మిగతా బ్యాట్స్‌విమెన్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోవడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. జట్టు స్కోరు ఐదు పరుగుల వద్ద స్మృతి మందానా (4)ను బ్రిట్నీ కూపర్ క్యాచ్ అందుకోగా, షకెరా సెల్మన్ అవుట్ చేసింది. కెరీర్‌లో తొలి టి-20 ఆడిన మేఘనా సింగ్ 16 బంతుల్లో 17 పరుగులు చేసి హీలీ మాథ్యూస్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగింది. స్టార్ బ్యాట్స్‌విమన్ వేదా కృష్ణమూర్తి (5)ని హీలీ మాథ్యూస్ క్లీన్ బౌల్డ్ చేసింది. కొంతసేపు ధాటిగా ఆడిన దీప్తి శర్మ 22 బంతుల్లో 24 పరుగులు సాధించి, అనీసా మహమ్మద్‌కు రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటైంది. ఆతర్వాత హర్మన్ క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతుంటే, మిగతా బ్యాట్స్‌విమెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. 37 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేసిన హర్మన్ చివరి వికెట్‌గా డాటిన్ బౌలింగ్‌లో షక్వానా క్వింటైన్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరింది. 18.1 ఓవర్లలో భారత్ 106 పరుగులకు ఆలౌటైంది. హర్మన్‌తోపాటు మేఘన, దీప్తి మాత్రమే రెండంకెల స్కో ర్లు చేయగా, మిగతా వారు సింగిల్ డిజిట్స్‌కే ప రిమితమయ్యారు. డాటిన్, అనీసా మహమ్మద్ చెరి మూడు వికెట్లు పడగొట్టారు.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 5 వికెట్లకు 137 (హీలీ మాథ్యూస్ 27, స్ట్ఫోనీ టేలర్ 47, దియేంద్ర డాటిన్ 35, శిఖా పాండే 2/29).
భారత్ ఇన్నింగ్స్ (లక్ష్యం 138 పరుగులు): 18.1 ఓవర్లలో 106 ఆలౌట్ (మేఘనా సింగ్ 17, దీప్తి శర్మ 24, హర్మన్‌ప్రీత్ కౌర్ 43, దియేంద్ర డాటిన్ 3/23, అనీసా మహమ్మద్ 3/23, హీలీ మాథ్యూస్ 2/15).