క్రీడాభూమి

‘జలాశ్వ’ను సందర్శించిన స్టార్ స్పిన్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోమవారం ఐఎన్‌ఎస్ జలాశ్వను సందర్శించాడు. ఇంగ్లండ్‌పై భారత్ జట్టు విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన రవిచంద్రన్ అశ్విన్‌కు నేవల్ డాక్‌యార్డు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో కొద్దిసేపు అశ్విన్ ముచ్చటించాడు. తూర్పు నౌకాదళ ప్రధాన అధికారి రియల్ అడ్మిరల్ బి.దాస్‌గుప్తా అశ్విన్‌ను సాదరంగా ఆహ్వానించి జలాశ్వలోకి తీసుకువెళ్ళారు. అక్కడ నావికులు, అధికారులతో అశ్విన్ భేటీ అయ్యారు. దేశ రక్షణలో వారి పాత్రను శ్లాఘించారు. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా ‘పిఎం సందేశ్ టు సోల్జర్స్’లో భాగంగా దేశ రక్షణ దళ ప్రతినిధులతో కాఫీ తీసుకోవాలన్న తన కోరికగా పేర్కొన్నానని, అయితే ఇంత త్వరగా నౌకాదళ ప్రతినిధులను కలవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అశ్విన్ చెప్పాడు.

చిత్రం.. నౌకాదళ అధికారులతో ముచ్చటిస్తున్న అశ్విన్