క్రీడాభూమి

సెమీస్‌కు జరీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిద్వార్, నవంబర్ 22: హరిద్వార్‌లో జరుగుతున్న జాతీయ మహిళల సీనియర్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణకు చెందిన వర్థమాన బాక్సర్, మాజీ ప్రపంచ జూనియర్ చాంపియన్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. దీంతో ఆమెకు ఈ ఈవెంట్‌లో పతకం ఖాయమైంది. 51 కిలోల ఫ్లైవెయిట్ విభాగంలో వేగంగా పురోగమిస్తున్న జరీన్ మంగళవారం జరిగిన క్వార్టర్ బౌట్‌లో అస్సాంకు చెందిన మంజు బసుమతరేపై సునాయాసంగా విజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ బౌట్‌లో ఆరంభం నుంచే పవర్‌ఫుల్ పంచ్‌లతో విరుచుకుపడిన జరీన్ 3-0 పాయింట్ల తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది. సెమీ ఫైనల్ బౌట్‌లో ఆమె హర్యానాకు చెందిన నీరజతో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో నీరజ కూడా 3-0 తేడాతో మణిపూర్ బాక్సర్ యాసినా చానూపై ఘన విజయం సాధించి పతకాన్ని ఖాయం చేసుకుంది. అలాగే 48 కిలోల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్స్ రజత పతక విజేత సర్జుబాలా దేవి (మణిపూర్) కూడా మెడల్ రౌండ్‌కు చేరుకుంది. హోరాహోరీగా క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో ఆమె 3-2 తేడాతో ఢిల్లీ రాష్ట్ర చాంపియన్ పూజా తొకాస్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో సర్జుబాల రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డుకు చెందిన రాజేష్ నర్వాల్‌తో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో రాజేష్ నర్వాల్ 3-0 తేడాతో కేరళకు చెందిన మరియా థామస్‌ను మట్టికరిపించగా, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండుసార్లు రజత పతకాలు సాధించిన కవితా చాహాల్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత కవితా గోయత్ (75 కిలోలు) కూడా తమతమ ప్రత్యర్థులను ఓడించి మెడల్ రౌండ్‌కు చేరుకున్నారు.

చిత్రం.. నిఖత్ జరీన్