క్రీడాభూమి

తిమ్మయ్య రెండు గోల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, నవంబర్ 24: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌ని మలేసియాపై భారత్ 4-2 తేడాతో విజయభేరి మోగించింది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత్ రెండో మ్యాచ్‌లో చెలరేగిపోయింది. నిక్కిన్ తిమ్మయ్య రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ వ్యూహాత్మకంగా ఆడగా, మలేసియా క్రీడాకారులు వేగంగా కదులుతూ ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేశారు. ఇరు జట్లు నువ్వానేనా అన్న చందంగా తలపడడంతో మొదటి క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్‌లో ఆరంభంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. 24వ నిమిషంలో తిమ్మయ్య ప్రత్యర్థి డి సర్కిల్‌లోకి దూసుకెళ్లి చక్కటి ఫీల్డ్ గోల్ చేశాడు. హాఫ్ టైమ్ పూర్తయ్యే సమయానికి మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం మొదలైన తొమ్మిది నిమిషాల తర్వాత మలేసియాకు ఫైజర్ సారి తనకు లభించిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. సుమారు ఆరు నిమిషాల పోరాటం తర్వాత రూపీందర్‌పాల్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. చివరి క్వార్టర్ మొదట్లో మలేసియాకు షహ్రిల్ సబా ఈక్వెలైజర్‌ను సాధించిపెట్టాడు. స్కోర్లు సమయం కావడం ఒక రకంగా భారత్‌కు ఉపయోగపడింది. మలేసియా గోల్ చేయడంతో కంగుతిన్న భారత ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో దాడులకు చేశారు. మైదానం మొత్తం తమ ఆధీనంలోనే ఉంచుకొని, పోరాటం సాగించారు. 55వ నిమిషంలో తిమ్మయ్య తన ఖాతాలో రెండు గోల్‌ను చేర్చుకోగా, మ్యాచ్ ముగియడానికి మరో నిమిషం ఉందనగా ఆకాశ్‌దీప్ సింగ్ ద్వారా భారత్‌కు నాలుగో గోల్ లభించింది. అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యాన్ని కనబరచిన భారత్ తిరుగులేని విజయాన్ని అందుకుంది.

పార్లమెంటుకు యువీ!
న్యూఢిల్లీ, నవంబర్ 24: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ గురువారం పార్లమెంట్ హౌస్‌కు వెళ్లాడు. అయితే, ఇది రాజకీయాల్లో చేరడానికో, ఏదో ఒక పార్టీకి మద్దతు పలకడానికో కాదు.. తన వివాహానానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడానికి అతను తల్లి షబ్నంతో కలిసి పార్లమెంటుకు వెళ్లాడు. బ్రిటిష్ మోడల్ హజెల్ కీచ్‌తో ఈనెల 29న యువీ వివాహం జరగనుంది. ఆ పెళ్లికి రావాల్సిందిగా అతను ప్రధానిని ఆహ్వానించాడు. ఈ వివాహానికి పలువురు బాలీవుడ్, క్రీడా స్టార్లు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఆరంభంలో యువీ, హాజెల్ నిశ్చితార్థం ఇండోనేషియాలోని బాలీలో జరిగింది.