క్రీడాభూమి

మహిళల ఆసియా కప్ క్రికెట్‌కు.. భారత్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: బ్యాంకాక్‌లో శనివారం నుంచి ప్రారంభం కానున్న మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ పాల్గొంటుంది. అయితే, పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడుతుందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. పాక్‌తో ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు ఆడని కారణంగా భారత మహిళల జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఆరు పాయింట్ల కోత విధించడం తీవ్ర విమర్శలకు గురైన విషయం తెలిసిందే. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఐసిసికి లేఖ కూడా రాసింది. మహిళల జట్టుకు పురుషుల జట్టు సంఘీభావం ప్రకటిస్తుందని, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే చాంపియన్స్ ట్రోఫీని బహిష్కరిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ టోర్నమెంట్‌లో భారత మహిళలు ఆడతారా లేదా అన్న ప్రశ్న తలెత్తింది. అయితే, ఈ అనుమానానికి బిసిసిఐ తెరదించింది. భారత జట్టు ఆ టోర్నీలో ఆడుతుందని బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరీ ప్రకటించాడు. కానీ, ఈనెల 29న పాకిస్తాన్‌త జరిగే మ్యాచ్‌ని ఆడుతుందా లేదా అన్నది స్పష్టంగా పేర్కొలేదు. ఆసియా కప్‌లో మహిళల జట్టు ఆడుతుందని మాత్రమే ప్రస్తుతానికి చెప్పగలనని, పాక్‌తో మ్యాచ్ గురించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదని అన్నాడు. ఇలావుంటే, సరిహద్దులో పాకిస్తాన్ ఉద్రిక్త వాతావరణ పరిస్థితిని సృష్టిస్తున్నదని, తీవ్రవాద దాడులను ప్రేరేపిస్తున్నదని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పిటిఐతో మాట్లాడుతూ అన్నాడు. ఈ పరిస్థితుల్లో పాక్‌తో క్రీడా సంబంధాలకు అవకాశం లేనేలేదని స్పష్టం చేశాడు. కాగా, ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్ జట్లు తలపడతాయి.