క్రీడాభూమి

మహిళల ఆసియా కప్‌లో భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్, నవంబర్ 26: మహిళల ఆసియా కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఈ జట్టు 64 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. వనే్డ ఫార్మాట్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న మిథాలీ రాజ్ 49 పరుగులతో నాటౌట్‌గా నలవగా, స్మృతి మందానా 41 పరుగులు చేసి, భారత్ విజయంలో తన వంతు పాత్ర పోషించింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 118 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 54 పరుగులకు ఆలౌట్ చేసింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ కేవలం 13 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టి, బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దారుణంగా దెబ్బతీసింది. కాగా, ఈ టోర్నీలో భారత్ రెండో మ్యాచ్‌ని ఆదివారం థాయిలాండ్‌తో ఆడుతుంది. ఈనెల 29న పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉంటుంది. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతున్నది.

బాక్సింగ్‌లో సచిన్‌కు స్వర్ణం
న్యూఢిల్లీ, నవంబర్ 26: ఎఐబిఎ యూత్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 49 కిలోల విభాగంలో భారత బాక్సర్ సచిన్ సింగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా)లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో అతను భారత్‌కు టైటిల్‌ను అందించాడు. ఫైనల్ ఫైట్‌లో అతను క్యూబాకు చెందిన జార్జి గ్రినన్‌ను ఓడించాడు.