క్రీడాభూమి

ఆదుకున్న బాబర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, నవంబర్ 27: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో బాబర్ ఆజమ్ ఆదుకోవడంతో పాకిస్తాన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 216 పరుగులు చేయగలిగింది. అయితే, న్యూజిలాండ్ కంటే 55 పరుగులు వెనుకంజలో నిలిచింది. కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 76 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఉదయం ఆటను కొనసాగించగా, రెండు వందల పరుగుల మైలురాయిని చేరడం కూడా కష్టమన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే బాబర్ ఆజమ్ 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఆ జట్టు కోరుకుంది. సర్ఫ్‌రాజ్ అహ్మద్ (41), సొహైల్ ఖాన్ (37) కూడా జట్టు కుప్పకూలకుండా తమ వంతు కృషి చేశారు. వీరి పోరాట పటిమ కారణంగా పాకిస్తాన్ స్కోరు రెండు వందల పరుగుల మైలురాయిని దాటింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ చక్కటి ప్రతిభ కనబరచి, 80 పరుగులకు ఆరు వికెట్లు సాధించాడు. నీల్ వాగ్నర్ 59 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. మహమ్మద్ అమీర్ తొలి ఓవర్‌లో మొదటి బంతిని వేయగా జీత్ రావల్ దానిని డిఫెన్సివ్‌గా ఆడాడు. అదే సమయంలో వర్షం కురవడంతో ఆటను నిలిపేశారు.