క్రీడాభూమి

హాంకాంగ్ ఫైనల్స్‌లో సింధు, సమీర్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలూన్, నవంబర్ 27: హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ సూపర్ సిరీస్ మహిళలు, పురుషుల విభాగాల్లో జరిగిన ఫైనల్స్‌లో భారత స్టార్లు పివి సింధు, సమీర్ వర్మ తడబడ్డారు. ఆఖరి యుద్ధాన్ని జయించలేక, రజత పతకాలతో సంతృప్తి చెందారు. రియో ఒలింపిక్స్ రజత పతక విజేత సింధు వరుస సెట్లలో ఓడితే, జాతీయ చాంపియన్ సమీర్ ఒక సెట్‌ను గెల్చుకొని, మ్యాచ్‌ని మూడు సెట్ల వరకు తీసుకెళ్లాడు. చైనీస్ తైపీకి చెందిన తాయ్ జూ ఇంగ్‌ను ఢీకొన్న సింధు 15-21, 17-21 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. రియో ఒలింపిక్స్‌లో సింధు చేతిలో ఓడిన జూ ఇంగ్ హాంకాంగ్ ఫైనల్‌లో ఆమెను వరుస సెట్లలోనే చిత్తుచేసి ప్రతీకారం తీర్చుకుంది. సింధుతో ఎనిమిదోసారి తలపడిన ఆమె ఐదో విజయాన్ని నమోదు చేసింది. మొదటి సెట్‌తో పోలిస్తే, రెండో సెట్‌లో సింధు ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించింది. కానీ, జూ ఇంగ్ వ్యూహాత్మకంగా ఆడి, రెండు సెట్లనూ తన ఖాతాలోనే వేసుకుంది.
పురుషుల సింగిల్స్‌లో 22 ఏళ్ల సమీర్ వర్మ అద్వితీయ పోరాట ప్రతిభ కనబరిచాడు. ఎన్ కా లాంగ్‌ను ఢీకొన్న అతను ఓటమిపాలైనప్పటికీ, చివరి వరకూ విజయం కోసం ప్రయత్నించి అభిమానులను ఆకట్టుకున్నాడు. మొదటి సెట్‌ను 14-21 తేడాతో కోల్పోయిన వర్మ రెండో సెట్‌ను 21-10 తేడాతో సులభంగానే దక్కించుకున్నాడు. కానీ, చివరిదైన మూడో సెట్‌లో అతను అదే స్థాయిలో రాణించలేకపోయాడు. కెరీర్‌లో మొదటిసారి ఒక సూపర్ సిరీస్ ఫైనల్ చేరిన అతను ఒత్తిడికి గురై, కీలక సెట్‌ను ప్రత్యర్థికి అప్పగించి, తాను రన్నర్ ట్రోఫీతో సంతృప్తి చెందాడు.

హాంకాంగ్ ఓపెన్‌లో రన్నరప్ ట్రోఫీకి పరిమితమైన పివి సింధు, సమీర్ వర్మ