క్రీడాభూమి

ముంబయి టెస్టుకు రాహుల్ ఫిట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, నవంబర్ 27: ఇంగ్లిండ్‌తో వచ్చేనెల ఎనిమిదో తేదీ నుంచి మొదలయ్యే నాలుగో టెస్టుకు ఓపెనర్ లోకేష్ రాహుల్ అందుబాటులో ఉంటాడని బిసిసిఐ ధీమా వ్యక్తం చేస్తున్నది. ఎడమ చేతికి గాయమైన కారణంగా అతను మూడో టెస్టులో ఆడడం లేదు. అయితే, వైద్య పరీక్షల అనంతరం అతను త్వరగానే కోలుకునే అవకాశాలున్నట్టు తెలిసిందని బిసిసిఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ముంబయి టెస్టు ఆరంభంలోగా అతను పూర్తి ఫిట్నెస్‌ను సంపాదించుకొని, తుది జట్టుకు ఎంపికయ్యేందుకు సిద్ధంగా ఉంటాడని తెలిపింది. రాహుల్‌కు తగిలిన గాయం తీవ్రమైనదేమీ కాదని స్పష్టం చేసింది. ఇలా ఉంటే రాహుల్ తరచు గాయాలబారిన పడడం అటు బోర్డు అధికారులను, ఇటు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. ఇటీవల న్యూజిలాండ్ మన దేశంలో పర్యటించినప్పుడు అతను ఫిట్నెస్ సమస్య కారణంగా చివరి రెండు టెస్టులతోపాటు ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు అతను ఎంపికైనప్పటికీ మొదటి టెస్టులో ఆడే అవకాశం దక్కలేదు. అయితే, డ్రాగా ముగిసిన రాజ్‌కోట్ టెస్టులో ఓపెనర్ గౌతం గంభీర్ విఫలం కావడంతో, విశాఖలో జరిగిన రెండో టెస్టుకు రాహుల్‌ను ఎంపిక చేశాడు. ఆ మ్యాచ్‌ని టీమిండియా 246 పరుగుల భారీ తేడాతో గెల్చుకుంది. కానీ, రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన అతను రెండో ఇన్నింగ్స్‌లో పది పరుగులకే వెనుదిరిగాడు. అదే టెస్టులో అతను గాయపడి మూడో టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. అతని స్థానంలో పార్థీవ్ పటేల్ మూడో టెస్టులో వికెట్‌కీపర్‌గానేగాక ఓపెనర్‌గానూ సేవలు అందిస్తున్నాడు.

ఆకట్టుకున్న పార్థీవ్
మొహాలీ: సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్లీ టెస్టు క్రికెట్ ఆడుతున్న వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ చక్కటి ఆటతో ఆకట్టుకున్నాడు. సహజంగా ఇంత సుదీర్ఘ విరామం అనంతరం టెస్టు ఆడితే, ఎవరైనా తీవ్రమైన ఒత్తిడికి లోనవుతారు. షాట్ల ఎంపికలో పొరపాట్లు చేస్తారు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ సామర్థ్యం ఎమిటనే విషయంలో సరైన అంచనా లేక పేలవంగా పెవిలియన్ దారి పడతారు. కానీ, పార్థీవ్ క్రీజ్‌లో ఉన్నంత సేపు చక్కటి ఫుట్‌వర్క్‌తో అలరించాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగి, 85 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఈ స్కోరులో ఆరు ఫోర్లు ఉన్నాయి. తాను డిఫెన్స్ కూడా బాగా ఆడగలనని నిరూపించాడు. అతను ఎదుర్కొన్న బంతుల్లో 65 డాట్ బాల్స్ కావడమే అందుకు నిదర్శనం.