క్రీడాభూమి

నాలుగు దేశాల హాకీ టోర్నీ-- భారత్‌కు కాంస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, నవంబర్ 27: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. మూడో స్థానానికి జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు మలేసియాను 4-1 తేడాతో చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ భారత్ ఆధిపత్యం కొనసాగితే, మలేసియా గట్టిపోటీని ఇవ్వలేకపోయింది. మ్యాచ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే బీరేంద్ర లాక్రా భారత్‌కు తొలి గోల్‌ను అందించాడు. ఒక గోల్ తన ఖాతాలో చేరడంతో నింపాదిగా ఆడడం మొదలుపెట్టగా, మలేసియా గోల్స్ కోసం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, అవి విఫలమయ్యాయి. రెండో క్వార్టర్ విఆర్ రఘునాథ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి, భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. ఈ దశలో మలేసియాకు జోల్ వాన్ హ్యూజెన్ ద్వారా ఒక గోల్ దక్కింది. మ్యాచ్ థర్డ్ క్వార్టర్ ముగిసే వరకూ మరో గోల్ నమోదు కాలేదు.
అయితే, చివరి క్వార్టర్‌లో భారత్ చెలరేగిపోయింది. అప్పటి వరకూ వ్యూహాత్మకంగా డిఫెన్సివ్ ఆటతో సమయాన్ని మింగేసిన భారత క్రీడాకారులు ఒక్కసారిగా ముప్పేట దాడి చేశారు. ఈ క్రమంలోనే తల్వీందర్ సింగ్ భారత్ ఖాతాలో మూడో గోల్‌ను చేర్చాడు. ఆతర్వాత కూడా మలేసియాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన భారత్‌కు 58వ నిమిషంలో రూపీందర్ పాల్ సింగ్ ద్వారా గోల్ లభించింది. మొత్తం మీద 4-1 తేడాతో మ్యాచ్‌ని ముగిచిన భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.