క్రీడాభూమి

సంప్రదాయబద్ధంగా కీచ్‌తో యువీ వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 30: బ్రిటిష్ మోడల్ హాజెల్ కీచ్‌తో భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ వివాహం బుధవారం సిక్కుల సంప్రదాయ రీతిలో జరిగింది. పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు, సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఇక్కడికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని బాబా రామ్ సింగ్ డేరా గురుద్వారా ఈ పెళ్లికి సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. యువీ, కీచ్ సంప్రదాయ దుస్తులు ధరించి, మత గురువు సమక్షంలో పెళ్లి లాంఛనాలను ముగించారు. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తదితరులు స్టార్ అట్రాక్షన్‌గా నిలిచారు. వివాహానికి ముందు సంగీత్ కార్యక్రమం ఆడంబరంగా జరిగింది. కోహ్లీ, ఖాన్ త్రయంసహా దానికి హాజరైన అంతా నృత్యాలతో అలరించారు.