క్రీడాభూమి

ఒకే పూల్‌లో భారత్, పాక్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, డిసెంబర్ 3: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ వచ్చే ఏడాది జూన్ 15 నుంచి 25వ తేదీ వరకు జరిగే పురుషుల హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యుఎల్) సెమీ ఫైనల్‌లో ఒకే పూల్ నుంచి పోటీపడనున్నాయి. 2018 వరల్డ్ కప్ హాకీకి అర్హత పొందే జట్లను ఖరారు చేయడానికి హెచ్‌డబ్ల్యుఎల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ లీగ్‌లో పది ప్రపంచ మేటి జట్లు తలపడతాయి. ఇప్పటికే ఆరు జట్లు ఖరారయ్యాయి. భారత్, పాక్‌తోపాటు టోర్నీకి ఆతిథ్యమిస్తున్న ఇంగ్లాండ్, రియో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ చాంపియన్ నెదర్లాండ్స్, దక్షిణ కొరియా హెచ్‌డబ్ల్యుఎల్ సెమీస్‌కు అర్హత సంపాదించాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగే హెచ్‌డబ్ల్యుఎల్ రౌండ్-2 ఈవెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచిన మరో నాలుగు జట్లు సెమీస్‌లో పోటీపడతాయి. భారత్ ‘బి’ పూల్ నుంచి బరిలోకి దిగుతుంది. ఈ పూల్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లు ఉంటాయి. మిగతా జట్లు ఖరారు కావాల్సి ఉంది.