క్రీడాభూమి

200 మీటర్ల ప్రపంచ రికార్డు ఇప్పుడు కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొనాకో, డిసెంబర్ 3: పురుషుల 200 మీటర్ల పరుగును 19.19 సెకన్లలో పూర్తి చేసి తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డును సమం చేయడం లేదా బద్దలు చేయడం ఇప్పుడు తనకే కష్టమని ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ స్పష్టం చేశాడు. అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్) నుంచి ఈ ఏటి మేటి అథ్లెట్ అవార్డును అతను స్వీకరించాడు. మహిళల విభాగంలో ఈ అవార్డు అల్మాజ్ అయానాకు లభించింది. ఐఎఎఎఫ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అవార్డును తీసుకున్న తర్వాత బోల్ట్ మాట్లాడుతూ 19 సెకన్ల కంటే తక్కువ సమయంలో 200 మీటర్ల దూరాన్ని పరిగెత్తడం తనకు ఇప్పుడు సాధ్యం కాదన్నాడు. వేగంగా పరిగెత్తగలిగినా, ఆ రికార్డును అందుకోవడం లేదా అధిగమించడాన్ని తాను ఊహించడం లేదని ఈఏడాది రియో ఒలింపిక్స్‌లో 100, 200 మీటర్ల పరుగుతోపాటు 4న100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాలు సాధించిన 30 ఏళ్ల బోల్ట్ అన్నాడు. అయితే, అంతర్జాతీయ కెరీర్‌ను మరికొంతకాలం కొనసాగిస్తానని చెప్పాడు.
రికార్డుల రన్నర్..
అయానాను రికార్డుల రన్నర్‌గా పేర్కోవాలి. రియో ఒలింపిక్స్‌లో 10,000 మీటర్ల పరుగును ఆమె 29:17.45 నిమిషాల్లో పూర్తి చేసి, స్వర్ణ పతకాన్ని అందుకోవడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అంతకు ముందు రికార్డు కూడా ఆమె పేరుమీదే ఉండడం విశేషం. తన గత రికార్డు టైమింగ్ కంటే 14 నిమిషాలు ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్న ఈ ఇథియోపియా రన్నర్ కొత్త రికార్డు నెలకొల్పింది. కాగా, అథ్లెటిక్స్ సంఘాలు, సమాఖ్యల అధికారులు, అథ్లెట్లు, జర్నలిస్టులతోపాటు ఆన్‌లైన్ పోలింగ్ ద్వారా ప్రజలు కూడా బెస్ట్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ ఎంపికకు నిర్వహించిన ఓటింగ్‌లో పాల్గొన్నారు. అత్యధిక శాతం మంది పురుషుల విభాగంలో బోల్ట్‌కు, మహిళల విభాగంలో అయానాకు అనుకూలంగా ఓటు వేశారు.

చిత్రం.. మొనాకోలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో బెస్ట్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీలతో అల్మాజ్ అయానా, ఉసేన్ బోల్ట్. చిత్రంలో మొనాకో యువరాజు అల్బర్ట్-2 (ఎడమ), ఐఎఎఎఫ్ అధ్యక్షుడు సెబాస్టియన్ కో (కుడి)