క్రీడాభూమి

లోధా సిఫార్సులపై నో కామెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోధా కమిటీ చేసిన సూచనలు, వాటి అమలుపై వ్యాఖ్యానించడానికి సచిన్ నిరాకరించాడు. కమిటీ సిఫార్సులను అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఇప్పటికే బిసిసిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, తాజా ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో లోధా సిఫార్సుల అమలుపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో చెప్పిన అంశాలకే కట్టుబడి ఉండాలని సభ్య సంఘాలన్నీ ముక్తకంఠంతో తేల్చిచెప్పాయని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ఈ నేపథ్యంలో లోధా సిఫార్సుల అమలుపై అడిగిన ఒక ప్రశ్నకు సచిన్ స్పందించలేదు. తాను వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నాడు. అయితే, దేశంలో క్రికెట్ అభివృద్ధికి బిసిసిఐ ఎంతో కృషి చేసిందని ప్రశంసించాడు. బోర్డు సహాయంతోనే తనలాంటి ఎంతో మంది క్రికెట్‌లో ఎదిగారని చెప్పాడు.

చిత్రం..న్యూఢిల్లీలో శనివారం జరిగిన లీడర్‌షిప్ సమిట్‌లో ప్రసంగిస్తున్న సచిన్ తెండూల్కర్