క్రీడాభూమి

పాక్‌తో మొదటి టెస్టుకు మార్పులేని ఆసీస్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, డిసెంబర్ 8: పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు బ్రిస్బేన్‌లో జరిగే మొదటి, డే/నైట్ టెస్టు మ్యాచ్‌కి ఎలాంటి మార్పులు లేకుండా 12 మందితో కూడిన జట్టునే కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో మొదటి రెండు టెస్టులుసహా వరుసగా ఐదు టెస్టుల్లో పరాజయాలను చవిచూసింది. దీనితో కంగుతిన్న ఆస్ట్రేలియా సెలక్టర్లు దక్షిణాఫ్రికాతో చివరి టెస్టుకు ఏకంగా ఆరు మార్పులతో బరిలోకి దిగింది. ఎడెలైడ్‌లో జరిగిన ఆ టెస్టును ఏడు వికెట్ల ఆధిక్యంతో కైవసం చేసుకుంది. కొత్త ఆటగాళ్లతో కూడిన ఆసీస్‌ను చిత్తుచేయవచ్చన్న ధీమాతో తొలి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 259 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా 383 పరుగులు సాధించి, సవాలు విసిరింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 250 పరుగులకే ఆలౌట్‌గాగా, 127 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరుస పరాజయాల నుంచి బయటపడిన ఉత్సాహంతో పాకిస్తాన్‌తో సిరీస్‌కు సిద్ధమవుతున్నది. కాగా, దక్షిణాఫ్రికాను చివరి టెస్టులో ఓడించిన జట్టును ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని సెలక్టర్లు తీర్మానించారు. ఇంగ్లాండ్‌లో జన్మించి, ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మాట్ రెన్‌షా పాక్‌తో జరిగే టెస్టులోనూ ఓపెనర్‌గా దిగుతాడు. డేవిడ్ వార్నర్, కెప్టెన్ స్టీవెన్ స్మిత్, పీటర్ హాండ్స్‌కోమ్, నిక్ మాడిసన్ బ్యాటింగ్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తారు. జొస్ హాజెల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌కు తోడు జాక్సన్ బర్డ్ బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తున్నది. దీనితో చాద్ సాయెర్స్‌కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు. కాగా, వేలి గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా షాన్ మార్ష్ పేరును సెలక్టర్లు ప్రకటించలేదు. మొదటి టెస్టులో ఆటగాళ్ల ప్రదర్శనను పరిశీలించిన తర్వాతే, రెండు, మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేస్తారు.
పాక్‌తో మొదటి (డే/నైట్) టెస్టుకు
ఆస్ట్రేలియా జట్టు ఇదే:
స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, జాక్సన్ బర్డ్, పీటర్ హాండ్స్‌కోమ్, జొష్ హాజెల్‌వుడ్, ఉస్మాన్ ఖాజా, నాథన్ లియాన్, నిక్ మాడిసన్, మాట్ రెన్‌షా, చాద్ సాయెర్స్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్.

చిత్రం..ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్