క్రీడాభూమి

మెస్సీ మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, డిసెంబర్ 11: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగా టోర్నమెంట్‌లో భాగంగా ఒసాసునాతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ చెలరేగిపోయాడు. చివరి వరకూ వ్యూహాత్మక డిఫెన్స్‌తో సరిపుచ్చిన బార్సిలోనా మ్యాచ్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు దాడులకు ఉపక్రమించింది. మెస్సీ రెండు మెరుపు గోల్స్ చేయగా, లూయిస్ సౌరెజ్ ఒక గోల్ చేశాడు. ఒసాసునా ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. కాగా, మరో మ్యాచ్‌లో రియల్ మాడ్రిడ్ 3-2 ఆధిక్యంతో డిపోర్టివో లా కొరునాను ఓడించింది. రియల్ సోసియాడ్ కూడా అదే ఆధిక్యంతో వలెన్షియాపై విజయం సాధించింది. లాస్ పల్మాస్, లెగానెస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయి.

చిత్రం..లియోనెల్ మెస్సీ