క్రీడాభూమి

షమీ, సాహా అన్‌ఫిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: భారత క్రికెట్ జట్టును గాయాల సమస్య వేధిస్తున్నది. ఆజింక్య రహానే ఇంగ్లాండ్‌తో జరుతున్న టెస్టు సిరీస్‌తోపాటు, ఆతర్వాత జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు కూడా గాయం కారణంగా అందుబాటులో ఉండడం లేదు. తాజాగా ఈ జాబితాలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా చేరారు. గాయాలతో బాధపడుతున్న వీరిద్దరూ నాలుగో టెస్టులో ఆడలేకపోయిన విషయం తెలిసిందే. కాగా, చెన్నైలో జరిగే చివరిదైన ఐదో టెస్టుకు కూడా వీరు దూరమయ్యారు. ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న కారణంగా వీరు ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు చెన్నైలో జరిగే టెస్టులో ఆడడం లేదని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. రాజ్‌కోట్‌లో జరిగిన మొదటి టెస్టులో బౌలింగ్ చేస్తున్న సమయంలోనే షమీ కండరాల నొప్పితో అల్లాడిపోయాడు. బాధను భరిస్తూనే అతను మరో రెండు టెస్టులు ఆడి, నాలుగో టెస్టులో పాల్గొలేకపోయాడు. చివరి టెస్టుకు కూడా అతను అందుబాటులో ఉండడు. అదే విధంగా వృద్ధిమాన్ సాహా కూడా మూడు, నాలుగు టెస్టుల్లో ఆడలేదు. అతని చేతి వేలికి తగిలిన గాయం నయంకాకపోవడంతో, చివరి టెస్టుకు అతని పేరును పరిశీలించబోరని బిసిసిఐ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

చిత్రం..చివరి టెస్టుకూ దూరమైన మహమ్మద్ షమీ, వృద్ధిమాన్ సాహా