క్రీడాభూమి

కెప్టెన్‌గా ‘ట్రిపుల్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్, నాలుగో రోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ నమోదు చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతనికి ఇది మూడో డబుల్ సెంచరీ. మూడు పర్యాయాలు డబుల్ సెంచరీలు చేసిన తొలి భారతీయ కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. జో రూట్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, కేన్ విలియమ్‌సన్ తదితరులు ప్రేక్షక పాత్ర వహిస్తే, ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ తనను తాను నిరూపించుకుంటున్నాడు. అతను ఈ ఏడాదే మూడు డబుల్ సెంచరీలు చేయడం విశేషం. వెస్టిండీస్‌పై మొదటి, న్యూజిలాండ్‌పై రెండో డబుల్ సెంచరీ సాధించిన అతను తాజాగా ఇంగ్లాండ్‌పై మూడోసారి ఈ మైలురాయిని చేరాడు. ఒకే క్యాలండర్ ఇయర్‌లో మూడు టెస్టు డబుల్ సెంచరీలు చేసిన ఐదో బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ గుర్తింపు సంపాదించాడు. మైఖేల్ క్లార్క్ ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహిస్తూ నాలుగు డబుల్ సెంచరీలు చేశాడు. సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్, రికీ పాంటింగ్, బ్రెండన్ మెక్‌కలమ్ తలా మూడేసి పర్యాయాలు డబుల్ సెంచరీలు సాధించగా, కోహ్లీ వారి సరసన స్థానం సంపాదించాడు. ఈ మ్యాచ్‌కి ముందు, ఇంగ్లాండ్‌తో మూడు టెస్టుల్లో అతను సగటున కేవలం 13.40 పరుగులు చేశాడు. అయితే, తాను ఏ క్షణంలోనైనా ఫామ్‌లోకి రాగలనని అతను డబుల్ సెంచరీ ద్వారా రుజువు చేశాడు.
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ టెసు సిరీస్‌లో కోహ్లీ ఇప్పటికే 600 పరుగుల మైలురాయిని దాటాడు. ఈ విధంగా ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను ఐదో స్థానాన్ని ఆక్రమించాడు. సునీల్ గవాస్కర్ రెండు పర్యాయాలు (1970-71 సీజన్‌లో వెస్టిండీస్‌పై 774 తిరిగి 1978-79 సీజన్‌లో అదే జట్టుపై 732 పరుగులు) ఈ ఫీట్‌ను ప్రదర్శించాడు. విరాట్ కోహ్లీ కూడా అతని మాదిరిగానే రెండు సార్లు (2014-15 సీజన్‌లో ఆస్ట్రేలియాపై 692 తిరిగి ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తాజా సిరీస్‌లో ఇప్పటికే 642 పరుగులు) ఈ రికార్డును నమోదు చేశాడు. గవాస్కర్, కోహ్లీ సరసన రాహుల్ ద్రవిడ్‌కు కూడా చోటు దక్కుతుంది. అతను 2003-04లో ఆస్ట్రేలియాపై 619, 2002లో ఇంగ్లాండ్‌పై 602 చొప్పున పరుగులు సాధించాడు. ఈ ముగ్గురూ తలా రెండు పర్యాయాలు ఒకే సీజన్‌లో ఆరు వందలకు పైగా పరుగులు చేయగా, ఈ జాబితాలో దిలీప్ సర్దేశాయ్ కూడా ఉన్నాడు. అతను 1970-71 సీజన్‌లో వెస్టిండీస్‌పై 642 పరుగులు చేశాడు.
ఈ ఏడాది కోహ్లీ టెస్టుల్లో 1,000 మొత్తం మీద ఈ ఫార్మాట్‌లో 4,000 పరుగుల మైలురాళ్లను అధిగమించిన విషయం తెలిసిందే. కాగా, గతంలో అతని అత్యధిక స్కోరు 211 పరుగులుకాగా, ఈ ఇన్నింగ్స్‌లో 235 పరుగులు సాధించడం ద్వారా తన వ్యక్తిగత రికార్డును మెరుగు పరచుకున్నాడు.

విరాట్ కోహ్లీ, జయంత్ యాదవ్, ఎనిమిదో వికెట్‌కు 241 పరుగుల రికార్డు
భాగస్వామ్యాన్ని అందించారు

టెస్టు క్రికెట్‌లో భారత కెప్టెన్ ఒక ఇన్నింగ్స్‌లో సాధించిన అత్యధిక స్కోరు కూడా ఇప్పుడు కోహ్లీ పేరిటే నమోదైంది. ఇంతకు ముందు, 2013లో ఆస్ట్రేలియాపై మహేంద్ర సింగ్ ధోనీ చేసిన 224 పరుగుల స్కోరును కోహ్లీ అధిగమించాడు. టెస్టుల్లో 50 పరుగుల సగటుతో అతను మేటి క్రికెటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. టైగర్ నవాబ్ ఆఫ్ పటౌడీ, సునీల్ గవాస్కర్, సచిన్ తెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ కూడా కెప్టెన్ హోదాలో డబుల్ సెంచరీలు చేశారు. అయితే, మూడు పర్యాయాలు ఈ ఘనతను సాధించిన కోహ్లీ భారతీయ కెప్టెన్లలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించాడు.

బ్రాడ్‌మన్ తర్వాత..
టెస్టుల్లో ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ, అత్యుత్తమ సగటును సాధించిన ఘనత సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ది. అతని సగటు 101.51 పరుగులుకాగా, కెప్టెన్‌గా కోహ్లీ సగటు 65.50 పరుగులు. బ్రాడ్‌మన్ వంటి అసాధారణ ప్రతిభావంతుడి తర్వాతి స్థానం కోహ్లీకి దక్కడం విశేషం. కెప్టెన్‌గా బ్రాడ్‌మన్ 38 ఇన్నింగ్స్ ఆడి, 3,147 పరుగులు చేశాడు. ఈ స్కోరులో 14 శతకాలు ఉన్నాయి. కాగా, కోహ్లీ కెప్టెన్ హోదాలో 34 ఇన్నింగ్స్‌లో 2,096 పరుగులు సాధించాడు. అతని స్కోరులో ఎనిమిది శతకాలున్నాయి.

చిత్రం..భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మూడో టెస్టు డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించిన కోహ్లీ