క్రీడాభూమి

క్వార్టర్స్‌కు భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 12: ప్రపంచ కప్ పురుషుల జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగి అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారత్ హ్యాట్రిక్ సాధించింది. ఈ టోర్నీలో ఇంతకుముందు వరుసగా రెండు విజయాలు సాధించిన భారత జట్టు సోమవారం ఇక్కడ మేజర్ ధ్యాన్ చంద్ ఆస్ట్రోటర్ఫ్ స్టేడియంలో జరిగిన తమ చివరి పూల్-డి మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేయడంతో పాటు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 11వ నిమిషంలో కెప్టెన్ హర్జీత్ సింగ్, 55వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ చెరొక ఫీల్డ్ గోల్ సాధించి పెట్టగా, దక్షిణాఫ్రికా జట్టుకు 28వ నిమిషంలో కైల్ లియోన్ కాచెట్ గోల్‌ను అందించాడు. దీంతో పూల్-డిలో ఆడిన మూడు లీగ్ మ్యాచ్‌లలోనూ విజయాలు సాధించి 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు సెమీస్‌లో స్థానం కోసం పూల్-సిలో రెండో స్థానంలో నిలిచిన స్పెయిన్ జట్టుతో గురువారం తలపడనుంది.
కాగా, ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, బెల్జియం జట్లు కూడా క్వార్టర్ ఫైనల్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. పూల్-ఎలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4-1 గోల్స్ తేడాతో ఆస్ట్రియాను ఓడించగా, పూల్-బిలో పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో బెల్జియం 7-0 గోల్స్ తేడాతో ఈజిప్టు జట్టును చిత్తుచేసింది.