క్రీడాభూమి

సుప్రీం కోర్టులో బిసిసిఐకి మరో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు సుప్రీం కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ లోధా కమిటీ సిఫారసులపై గత జూలై 18వ తేదీన ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ బిసిసిఐ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఈ తీర్పులో తమకు ఎలాంటి తప్పు కనిపించడం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్, జస్టిస్ ఎన్‌ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన క్రికెట్ బోర్డుగా ఉన్న బిసిసిఐలో మంత్రులు, అధికారులు ఎలాంటి పదవులు చేపట్టకుండా నిరోధించడంతో పాటు బోర్డు సభ్యుల వయో పరిమితి 70 ఏళ్లకు పరిమితం చేయాలని లోథా కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ సిఫారసులను జూలై 18వ తేదీన సుప్రీం కోర్టు ఆమోదించి, వాటిని అమలుచేసి తీరాలని బిసిసిఐకి స్పష్టం చేసింది.