క్రీడాభూమి

డే/నైట్ టెస్టుకు పాక్, ఆసీస్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, డిసెంబర్ 14: పాకిస్తాన్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు గురువారం నుంచి మొదలుకానున్న మొదటి టెస్టు మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్నాయి. ఇది డే/నైట్ టెస్టు కావడంతో ఆసీస్ కంటే పాకిస్తాన్‌పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనేది వాస్తవం. అయితే, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో వరుస పరాజయాలను ఎదుర్కొన్న ఆస్ట్రేలియా అతి కష్టం మీద పుంజుకుంది. జట్టులో ఆరు మార్పులతో బరిలోకి దిగి, దక్షిణాఫ్రికాపై విజయాన్ని సాధించిన ఆస్ట్రేలియా అదే ఆత్మవిశ్వాసాన్ని కొనసాగిస్తుందా లేక అంతకు ముందు మాదిరిగానే పరాజయాల బాటలో సాగుతుందా అన్నది చూడాలి. చాలాకాలంగా స్వదేశంలో ఒక్క సిరీస్ కూడా ఆడని పాకిస్తాన్‌కు యునైటెడ్ అరబ్ ఎనిమరేట్స్ హోం గ్రౌండ్‌గా మారింది. అక్కడ కొంతలో కొంత మెరుగ్గానే ఆడుతున్నప్పటికీ, విదేశీ పర్యటనల్లో మాత్రం మిస్బా హక్ నేతృత్వంలోని పాక్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఆస్ట్రేలియాలో పాక్ ఇప్పటి వరకూ 11 సిరీస్‌లు ఆడింది. ఒక్కసారి కూడా సిరీస్‌ను సాధించలేకపోయింది. ఇంతకు ముందు ఆసీస్‌లో పర్యటించినప్పుడు సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకుంది. 1999 నుంచి ఇంత వరకూ పాక్ ఒక్క టెస్టులోనూ ఆసీస్‌ను ఓడించలేకపోయింది. ఏకంగా తొమ్మిది పరాజయాలను ఎదుర్కొంది. న్యూజిలాండ్ పర్యటనను ముగించుకొని మిస్బా బృందం ఆస్ట్రేలియా వచ్చింది. అక్కడ చూపిన ఫామ్ ఇక్కడ కూడా పాక్ కొనసాగిస్తుందని అనుకోవడానికి వీల్లేదు. న్యూజిలాండ్‌తో పోలిస్తే వాతావరణం, పిచ్ స్వభావం ఆస్ట్రేలియాలో భిన్నంగా ఉంటుంది. పైగా, ఆసీస్‌తో ఆ మొదటి టెస్టు డే/నైట్ మ్యాచ్ కావడంతో మిస్బా సేనకు తడబాటు తప్పకపోవచ్చు. మొత్తం మీద వరుస పరాజయాల నుంచి గట్టెక్కినప్పటికీ, పూర్తిగా ఆత్మవిశ్వాసాన్ని సంపాదించని ఆస్ట్రేలియా, విదేశాల్లో గొప్పగా రాణించిన సందర్భాలు లేని పాకిస్తాన్ దాదాపు ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి, రెండు జట్లు కూడా గురువారం నుంచి మొదయల్యే డే/నైట్ టెస్టును ప్రాతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దీనితో హోరాహోరీ తప్పకపోవచ్చు.

మైఖేల్ ఆడమ్స్‌తో
ఆనంద్ గేమ్ ్ర

లండన్, డిసెంబర్ 14: లండన్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్ నాలుగో రౌండ్‌లో మైఖేల్ ఆడమ్స్‌ను ఢీకొన్న ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఇది ఆనంద్‌కు వరుసగా నాలుగో డ్రా. ఈ గేమ్ ముగిసే సమయానికి అతను మొత్తం రెండు పాయింట్లు సంపాదించాడు. ఆడమ్స్ రెండు గేమ్స్‌ను చేజార్చుకొని, మరో రెండు గేమ్స్‌లో రాజీపడి ఒక పాయింటు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలావుంటే, వెస్లీ సోతో అనిష్‌గిరి గేమ్ కూడా డ్రాగా ముగిసింది. అయితే, వెస్లీ ఈ డ్రా తర్వాత మొత్తం మూడు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెసెలిన్ తపలోవ్‌ను ఓడించిన హికారు నాకమురా మొత్తం 2.5 పాయింట్లు సంపాదించాడు. అదే విధంగా మాక్సిమ్ వచియెర్ లాగ్రవ్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్న వ్లాదిమీర్ క్రామిక్ ఖాతాలోనూ రెండున్నర పాయింట్లు ఉన్నాయి. ఫాబియానో కరువానా, లివోన్ అరోనియన్ తమ గేమ్‌ను డ్రాగా ముగించారు.